Tesla: భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ.. కొనుగోలుదారులకు పన్నుల భారం?
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా చివరకు భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ ఏప్రిల్ నుంచి భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించనుంది.
టెస్లా భారత మార్కెట్లోకి రావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతుగా నిలుస్తోంది.
ఇందుకు అనుగుణంగా, దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లు గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ సంస్థ CLSA నివేదిక పేర్కొంది.
టెస్లా మోడల్ 3 ధర ఎంతంటే?
టెస్లా మోడల్ 3 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
కంపెనీ ఈ కారును రూ. 21 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేయాలని భావించినా, పన్నులు, ఇతర ఖర్చులతో దీని ధర రూ. 35 లక్షలకు పెరిగే అవకాశం ఉంది.
Details
అమెరికాలో ధర, భారత మార్కెట్ ప్రభావం
అమెరికాలో టెస్లా మోడల్ 3 రిటైల్ ధర USD 35,000 (సుమారు రూ. 30.4 లక్షలు)గా ఉంది.
అయితే భారతదేశంలో దిగుమతి సుంకం, రోడ్డు పన్ను, బీమా వంటి అదనపు ఖర్చులు వల్ల ఈ కారు రూ. 35 నుంచి 40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
దేశీయ బ్రాండ్ల కంటే ధర ఎక్కువే!
దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మోడళ్లతో పోలిస్తే టెస్లా మోడల్ 3, 20శాతం నుంచి 50శాతం వరకు అధికంగా ధర కలిగి ఉంటుంది.
మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి ఇ-విటారా వంటి కార్లతో పోటీకి వస్తున్నా, ధర పరంగా టెస్లా మార్కెట్‌పై అంతగా ప్రభావం చూపకపోవచ్చని CLSA నివేదిక చెబుతోంది.
Details
భారత మార్కెట్‌పై టెస్లా ప్రభావం?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ప్రస్తుతం చైనా, యూరప్, అమెరికా మార్కెట్ల కంటే తక్కువ.
అయినా టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టడం దేశీయ ఆటోమోటివ్ తయారీదారులకు సవాల్ అవుతుందని అంచనా.
టెస్లా రాబోయే నెలల్లో దిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో తన మోడళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది.
భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల విపణిలో ఎంత వరకు విజయాన్ని సాధిస్తుందో చూడాలి!