Yamaha RX100 New Avatar: భారత మార్కెట్లోకి కొత్త అవతార్‌లో యమహా ఆర్ఎక్స్100 బైక్
యమహా తన ఐకానిక్ RX100ని పెద్ద ఇంజన్‌తో పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం,కొత్త బైక్‌లో RX nomenclature ఉంటుంది.అయితే RX 100 పెద్ద 225.9 cc శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యంతో రానుంది. ఈ బైక్ ఇంజన్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. 20.1 bhp పవర్, 19.93 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.అదేవిధంగా BS6 ఫేజ్ 2 కఠినమైన ఉద్గారాలకు తగినట్టుగా డిజైన్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. RX100 సక్సెసర్ దాని ముందున్న కొన్ని డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం,దీని ధర రూ. 1.25 లక్షల నుండి రూ. 1.50 లక్షల మధ్య ఉండవచ్చు. అయితే ఈ బైక్ గురించి యమహా ఇంకా ఏమీ ధృవీకరించలేదు.
2022లో కూడా యమహా RX100 సక్సెసర్ గురించి వార్తలు
ఇలాంటి నివేదిక రావడం ఇది మొదటిసారేమి కాదు.2022లో కూడా యమహా RX100 సక్సెసర్ గురించి వార్తలు వచ్చాయి. అప్పటి,యమహా ఇండియా ప్రెసిడెంట్ ఇషిన్ చిహానా RX100 బైక్ ని మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. RX100 దాని ప్రస్తుత మోనికర్‌ను అలాగే ఉంచుతుందని అయన చెప్పారు.దాని స్థానంలో మరో మోటార్ సైకిల్ ఉండదు. సంస్థ ఈచిహ్నాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తోందన్నారు.1980 నుండి ఇటీవలి వరకు ప్రజాదరణ పొందిన ఈ బైక్ దాని వేగంతో గుర్తింపు పొందింది. అయితే,కంపెనీ కొన్నేళ్ల క్రితం ఈ బైక్‌ను నిలిపివేసింది.ఇప్పుడు దీనిని మళ్లీ పరిచయం చేయబోతోంది. యమహా 1985 నుండి 1996 వరకు టూ-స్ట్రోక్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది.ఆతర్వాత 2005 వరకు దాని వివిధ పునరావృతాలను ప్రవేశపెట్టింది.