LOADING...
Hornet 2.0 vs Pulsar N160:యువ రైడర్ల సరికొత్త డ్యూయల్ ఛాయిస్.. హార్నెట్ 2.0 vs N160.. బెస్ట్ ఆఫ్షన్ ఇదే!
యువ రైడర్ల సరికొత్త డ్యూయల్ ఛాయిస్.. హార్నెట్ 2.0 vs N160.. బెస్ట్ ఆఫ్షన్ ఇదే!

Hornet 2.0 vs Pulsar N160:యువ రైడర్ల సరికొత్త డ్యూయల్ ఛాయిస్.. హార్నెట్ 2.0 vs N160.. బెస్ట్ ఆఫ్షన్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

యువ రైడర్లను ఆకట్టుకుంటున్న 150-200cc సెగ్మెంట్‌లో హోండా హార్నెట్ 2.0, కొత్త బజాజ్ పల్సర్ N160 మధ్య పోటీ మరింత హాట్‌గా మారింది. హార్నెట్ 2.0 స్టైలిష్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తుండగా, పల్సర్ N160 స్పోర్టీ పనితీరు, అగ్రెసివ్ లుక్, శక్తివంతమైన రోడ్ గ్రిప్‌తో ఆకర్షిస్తోంది. ధరలు, ఇంజిన్ స్పెక్స్, సస్పెన్షన్, భద్రతా లక్షణాలు, మైలేజ్ ఈ రెండు బైక్‌ల ప్రత్యేకతలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

Details

హోండా హార్నెట్ 2.0 vs కొత్త బజాజ్ పల్సర్ N160 

యూత్ ఫ్రెండ్లీ బైక్‌ల్లో ఈ రెండు మోడళ్లు టాప్‌ ప్రతిస్పర్థులుగా నిలుస్తున్నాయి. పల్సర్ N160 → స్పోర్టీ పనితీరు, అగ్రెసివ్ డిజైన్, కనెక్టివిటీ ఫీచర్లు, మన్నికైన హ్యాండ్లింగ్ హార్నెట్ 2.0 → స్మూత్ పవర్ డెలివరీ, తక్కువ బరువు, ప్రీమియం USD ఫోర్క్స్, మంచి మైలేజ్ రోజువారీ ప్రయాణంతో పాటు స్పోర్టీ రైడింగ్‌ను ఇష్టపడేవారికి N160 సరిపోతే, స్టైలిష్ డిజైన్, స్మూత్ రైడ్ కోరుకునేవారికి హార్నెట్ 2.0 మంచి ఆప్షన్. ఇప్పుడు రెండు బైక్‌ల స్పెక్స్‌ను విడమరచి చూడండి.

Details

హోండా హార్నెట్ 2.0 

ఇంజిన్ & పనితీరు 184.40cc ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ SI ఇంజిన్ పవర్: 16.99 PS @ 8500 rpm టార్క్: 15.7 Nm @ 6000 rpm 5-స్పీడ్ గేర్‌బాక్స్ + అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ → గేర్ మార్పు మరింత సులభం సస్పెన్షన్ & భద్రత గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్ డ్యూయల్ చానల్ ABS వెడల్పైన టైర్లు హాజర్డ్ స్విచ్ ఫీచర్లు TFT డిజిటల్ మీటర్ Honda RoadSync బ్లూటూత్ కనెక్టివిటీ నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్స్ 12L ఫ్యూయల్ ట్యాంక్ 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ మైలేజ్: 42.3 kmpl ధర ₹1,45,836 (ఎక్స్-షోరూమ్)

Advertisement

Details

కొత్త బజాజ్ పల్సర్ N160 (న్యూ వేరియంట్)

ఇంజిన్ & పనితీరు 164.82cc DTS-i ఇంజిన్ పవర్: 16 PS @ 8750 rpm టార్క్: 14.65 Nm @ 6750 rpm 5-స్పీడ్ గేర్‌బాక్స్ మైలేజ్: 52.2 kmpl ఫీచర్లు USB మొబైల్ ఛార్జర్ బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ కన్సోల్ కాల్/మెసేజ్ అలర్ట్స్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LED టెయిల్‌ల్యాంప్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ కెర్బ్ వెయిట్: 152 kg 14L ఫ్యూయల్ ట్యాంక్ సీటు ఎత్తు: 795 mm

Advertisement

Details

సస్పెన్షన్ & భద్రత

37mm గోల్డ్ USD టెలిస్కోపిక్ ఫోర్క్స్ 3 ABS రైడ్ మోడ్‌లు: రోడ్ రైన్ ఆఫ్-రోడ్ డ్యూయల్ చానల్ ABS ఫ్రంట్: 300 mm డిస్క్, రియర్: 230 mm డిస్క్ డిజైన్ & కలర్స్ పెర్ల్ మెటాలిక్ వైట్ రేసింగ్ రెడ్ పోలార్ స్కై బ్లూ బ్లాక్ ధర ₹1.24 లక్షలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్)

Advertisement