LOADING...
సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ కొత్త వేరియంట్ ధర రూ. 36.91 లక్షలు
సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌పై ప్రయాణించనుంది.

సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ కొత్త వేరియంట్ ధర రూ. 36.91 లక్షలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2023
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

సిట్రోయెన్ ఇండియన్ మార్కెట్లోకి సిట్రోయెన్ C5 ఎస్‌యూవీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎస్‌యూవీ ధరను సంస్థ వెల్లడించింది. రూ. 36.91 లక్షలుగా నిర్ధారించింది. "ఫీల్" అని పిలిచే కొత్త బేస్ ట్రిమ్ రూ. రేంజ్-టాపింగ్ షైన్ మోడల్ కంటే 76,000 తక్కువగా ఉండడం విశేషం. ఇది 175hp, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ఫీల్ వేరియంట్‌ను మోనోటోన్, డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్‌లలో అందిస్తోంది. బేస్ ట్రిమ్‌లో ఏ ఫీచర్లు లేవని కార్‌మేకర్ ధృవీకరించనప్పటికీ, జిగ్‌వీల్స్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం 10.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్, పనోరమిక్ సన్‌రూఫ్ ఇందులో లేనట్లు సమాచారం.

Details

సిట్రోయెన్ C5లో ఆరు ఎయిర్ బ్యాగులు

సిట్రోయెన్ C5లో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీటు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల వంటి ఫీచర్లు ఉండనున్నాయి. C5 ఎయిర్‌క్రాస్ ప్రీమియం మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో పోటీపడనుంది. ఈ వెహికల్ మంచి కండిషన్‌తో పాటు ఇతర వాహనాలతో పోలిస్తే మెరుగైన రైడ్, భద్రతను అందించనుంది. C5 ఎయిర్‌క్రాస్ భారతదేశంలోని ప్రీమియం మిడ్-సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్ టక్సన్, జీప్ కంపాస్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌లకు గట్టి పోటీని ఇవ్వనుంది.