Page Loader
Rumion vs Ertiga: రుమియన్​- ఎర్టిగాలో ఉన్న పోలికలు ఇవే.. ఏదీ కొనచ్చు!
రుమియన్​- ఎర్టిగాలో ఉన్న పోలికలు ఇవే.. ఏదీ కొనచ్చు!

Rumion vs Ertiga: రుమియన్​- ఎర్టిగాలో ఉన్న పోలికలు ఇవే.. ఏదీ కొనచ్చు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 29, 2023
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టయోటా, తాజాగా రుమియన్‌ని ఇండియాలో లాంచ్ చేసింది. మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా ఈ ఎంపీవీని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే రెండింట్లోనూ కొన్ని పొలికలున్నాయి. వీటిలో ఏది కొనాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎర్టిగా ఫ్రెంట్ గిల్, రుమియన్ ఫ్రెంట్ గ్రిల్‌లో కొన్ని మార్పులను చేశారు. రుమియన్‌లో క్రోమ్ సరౌండింగ్‌తో కూడిన మెష్ పాటర్న్ గ్రిల్ రానుంది. మారుతీ సుజుకీ ఎర్టిగా‌లో ఫ్రెంట్ గ్రిల్ సెంటర్ లో క్రోమ్స్ ట్రిమ్స్ వస్తాయి. ఇక రుమియన్ ఫ్రెంట్ బంఫర్ ను టయోటా సంస్థ పూర్తిగా మార్చేసింది.

Details

మారుతీ సుజుకీ

మారుతీ సుజుకీ డిగ్నిటీ బ్రౌన్​, మాగ్మా గ్రే, ఆక్స్​ఫర్డ్​ బ్లూ, ఔబర్న్​ రెడ్​, స్పెండిడ్​ సిల్వర్​, ఆర్కెటిక్​ వైట్​, మిడ్​నైట్​ బ్లాక్​ వంటి కలర్స్ లో రానుంది.ఇక రుమియన్ స్పంకీ బ్లూ, రస్టిక్​ బ్రౌన్​, ఐకానిక్​ గ్రే, కేఫ్​ వైట్​, ఎంటైసింగ్​ సిల్వర్​ కలర్ ఆప్షన్ తో వస్తోంది. రుమియన్ కేబిన్ లో గ్రే షేడ్స్ రానుండగా, ఎర్టిగాలో డ్యూయెల్ టోన్ రంగు ఉండనుంది. వీటి ఇంటీరియర్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. రుమియన్​లో మొత్తం 6 వేరియంట్లు ఉన్నాయి. ఎస్​ ఎంటీ- రూ. 10.29లక్షలు, ఎస్​ ఏటీ- రూ. 11.89లక్షలు, జీ ఎంటీ- రూ. 11.45లక్షలు, వీ ఎంటీ- రూ. 12.18లక్షలు, వీ ఏటీ- రూ. 13.68లక్షలు, ఎస్​ ఎంటీ- రూ. 11.24లక్షలు