Top Selling Cars August: 2023 అగస్టు నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!
భారత ఆటో మొబైల్ మార్కెట్లో కార్ల విక్రయాలు జోరందుకున్నాయి. ఆగస్టు నెలలో హుందాయ్ కెట్రా, టాటా పంచ్ ఎస్‌యూవీ లు అత్యధికంగా సేల్ అవ్వగా.. మారుతీ సుజుకీ, మారుతి స్విప్ట్ కార్లు మాత్రం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. మారుతి స్విప్ట్ 18,653 యూనిట్ల అమ్మకాల జరగ్గా, గత ఏడాది ఇదే నెలలో 11,275 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. గతేడాదితో 65.44% గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మారుతి సుజుకి స్టేబుల్ నుండి వచ్చిన మరొక మోడల్ అయిన బాలెనో ఆగస్ట్ 2023లో రెండవ అత్యధికంగా అమ్ముడైన కారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈనెలలో 18,418 యూనిట్లను విక్రయించగా, గతేడాది ఆగస్టు 2022తో 18,516 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
మారుతి వ్యాగన్ఆర్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం
మారుతి వ్యాగన్ఆర్ కార్ల అమ్మకాల మాత్రం క్షీణించాయి. గతేడాది ఆగస్టులో 18,398 కార్లను విక్రయించగా, ఈ నెలలో కేవలం 15,578 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక మారుతి బ్రెజ్జా కూడా 14,572 యూనిట్ల అమ్మకాలతో తగ్గుముఖం పట్టింది. నెక్సాన్ కొన్ని నెలలుగా టాటా కారు విక్రయాల్లో నంబర్ -1గా ఉండగా, ఈ ఏడాది మాత్రం టాప్ 10 కార్ల జాబితాలో కూడా చోటు సంపాదించలేదు. హ్యుందాయ్ క్రెటా ఆగస్టు 2023లో 13,832 యూనిట్లను విక్రయించగా, మారుతి డిజైనర్ 13293 యూనిట్లను విక్రయించింది. మారుతి ఫ్రాంక్ 12,164 యూనిట్లతో తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకుంది.ఆగస్టు 2023లో మొత్తం మీద ప్రముఖ దిగ్గజ కంపెనీలు 143,549 యూనిట్లను విక్రయించాయి. గతేడాది ఆగస్టుతో పొలిస్తే 9.63% వృద్ధిని సాధించింది.