Page Loader
Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే!
ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే!

Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొత్త ఎస్‌యూవీ మోడళ్లను అందించేందుకు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే పలు కొత్త ఎస్‌యూవీలు, అప్‌డేటెడ్ వెర్ష్‌లు మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవే:

Details

టాటా హారియర్‌ ఈవీ

టాటా మోటార్స్ రూపొందించిన హారియర్‌ ఈవీ ఈ జూన్‌లో విడుదల కానుంది. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, ఆధునిక ఫీచర్లతో అదిరిపోయే అనుభూతిని అందించనుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైగా రేంజ్ ఇవ్వగలదని అంచనా. దీనిలో డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్, మల్టీ-లింక్ రియర్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. జూన్ 3న దీనిని అధికారికంగా లాంచ్ చేయనున్నారు.

Details

మారుతీ సుజుకీ ఇ-విటారా

ఇది మారుతీ సుజుకీ నుండి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ SUV. హ్యుందాయ్ క్రెటా EV, ఎంజీ ZS EV, మహీంద్రా BE.6 వాహనాలతో పోటీపడనుంది. రెండు బ్యాటరీ వేరియంట్లలో 49 kWh, 61 kWh ఈ వాహనం అందుబాటులోకి రానుంది. ఈ SUV 500 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుందని కంపెనీ చెబుతోంది. హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ప్రముఖ కాంపాక్ట్ SUV వెన్యూ తాజాగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో రాబోతోంది. కొత్తగా డిజైన్ చేసిన బాడీ స్టైల్‌తో పాటు మరిన్ని ఆధునిక ఫీచర్లను ఇందులో చేర్చనున్నారు. టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, స్కోడా కైలాక్, మారుతీ బ్రెజ్జా, కియా సోనెట్‌లకు ఇది గట్టి పోటీగా నిలవనుంది.

Details

మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కలెక్టర్స్ ఎడిషన్

భారత మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మెర్సిడెస్-ఏఎంజీ జీ63 కలెక్టర్స్ ఎడిషన్ జూన్ 12న విడుదల కానుంది. ప్రత్యేక రంగులు, సిల్వర్ వీల్స్‌తో ఈ ఎస్‌యూవీ ఆకర్షణీయంగా ఉండనుంది. 4.0 లీటర్ టర్బో V8 ఇంజన్, 577 హార్స్‌పవర్, 850 ఎన్ఎమ్ టార్క్‌తో బలమైన పనితీరును అందిస్తుంది. మహీంద్రా ఎక్స్‌ఈవీ 7ఈ XUV700 తరహాలో డిజైన్ చేయబడిన ఎక్స్‌ఈవీ 7ఈ మోడల్‌ రెండు బ్యాటరీ వేరియంట్లలో - 59 kWh, 79 kWh - రానుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. పూర్తి వివరాలను మహీంద్రా ఇంకా వెల్లడించనప్పటికీ, ఈ ఏడాది చివరినాటికి మార్కెట్లోకి రావడం ఖాయం.