Mahindra Scorpio Sales : నవంబర్ అమ్మకాల్లో మహీంద్రా స్కార్పియో రికార్డు.. రెండు నెలల్లోనే హ్యుంద్రాయ్ కెట్రాను దాటేసింది!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మహీంద్రా స్కార్పియో అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. నవంబర్‌లో వాల్యూమ్ పరంగా హ్యుందాయ్ కెట్రాను అధిగమించింది. మూడు వరుస సీట్లతో మహీంద్ర స్కార్పియో వాల్యూమ్ అత్యధిక స్థాయిలో పెరగడం విశేషం. మహీంద్రా నవంబర్ నెల అమ్మకాలలో 32.24శాతం వృద్ధిని సాధించింది. వివిధ మోడళ్లలో మహీంద్రా మొత్తం 39,981 యూనిట్లను విక్రయించింది. గత నవంబర్‌లో కెట్రా 11,814 యూనిట్లతో పోలిస్తే, మహీంద్రా 12,185 యూనిట్ల స్కార్పియో వాహనాలను విక్రయించింది. నవంబర్ 2023లో మహీంద్రా ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు 39,981 యూనిట్లుగా నమోదయ్యాయి.
గణనీయమైన వృద్ధిని సాధించిన మహీంద్రా XUV700, థార్ SUV
మహీంద్రా XUV700, థార్ SUV కూడా నవంబర్ నెలలో నెలలో గణనీయమైన వృద్ధిని సాధించాయి. XUV700 26.66 శాతం వృద్ధిని సాధించింది. నవంబర్ 2022లో 5,701 యూనిట్లతో పోలిస్తే ఈ నెలలో 7,221 యూనిట్లను విక్రయించింది. థార్ 45.72శాతం పెరుగుదలతో పాటు ఈ ఏడాది 5,810 యూనిట్లను విక్రయించింది. మహీంద్రా మరాజో 44.94శాతం క్షీణతను చవిచూసింది, గత నెలలో 89 యూనిట్లు విక్రయించగా నవంబర్‌లో కేవలం 49 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.