
Maruti Suzuki: ఎంట్రీ లెవెల్ కార్లలోనూ టాప్ సేఫ్టీ.. 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో బెస్ట్ మోడల్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయులలో సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు ఇప్పుడు ఎంట్రీ లెవెల్ కార్లలోనూ అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఇకపై 6 ఎయిర్‌బ్యాగులు వంటి భద్రతా లక్షణాలు కేవలం ఖరీదైన కార్లకే కాదు, బడ్జెట్ కార్లలోనూ చూడవచ్చు.
ఈ క్రమంలో 6 ఎయిర్‌బ్యాగులతో అందుబాటులో ఉన్న చౌక ధరల సురక్షిత కార్లు ఇవే
Details
మారుతి సుజుకి ఆల్టో K10
భారతదేశంలో అందుబాటులో ఉన్న అతి చౌక 6 ఎయిర్‌బ్యాగ్ కార్ ఇదే. ప్రారంభ ధర రూ.4.23 లక్షలు. ఈ కారు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (67 bhp శక్తితో)తో వస్తోంది.
మాన్యువల్, ఆటోమేటిక్(AMT)ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
ఇటీవల ఈ మోడల్ ధర రూ.16,000 పెరిగినప్పటికీ, సేఫ్టీ పరంగా మెరుగుదలలు కస్టమర్లకు ఆకర్షణగా మారాయి.
మారుతి సుజుకి ఈకో
ప్రారంభ ధర రూ. 5.69 లక్షలు. ఎమ్పీవీ విభాగంలో అత్యంత సరసమైన సేఫ్ కారు. ప్రస్తుతం ఇది 6 సీట్ల కాన్ఫిగరేషన్‌లో కూడా లభిస్తోంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (80 bhp శక్తితో)తో వస్తుంది.
తాజా భద్రతా నవీకరణలతో ధర సుమారుగా రూ. 25,500 పెరిగింది.
Details
మారుతి సుజుకి సెలెరియో
ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు. ఇది మంచి మైలేజ్‌తో పాటు సురక్షిత ప్రయాణం కోరేవారికి సరైన ఎంపిక. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (67 bhp)తో లభిస్తుంది.
సీఎన్జీ వేరియంట్‌తో పాటు AMT ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
ఈ కార్లు బడ్జెట్‌లో ఉన్నా భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా తయారయ్యాయి. వేసవి సెలవుల్లో కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉంటే, వీటిని ఒక్కసారి పరిశీలించడం మంచిదే!