
Toyota Cars Waiting Period : ఈ కార్లపై ఎక్కువ వెయిటింగ్ పీరియడ్.. కొనాలంటే నెలలు ఆగాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా కార్లకు దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది.
ఎక్కువ మంది కలిసి ప్రయాణించే వీలుండటంతో ఈ కారును అధికశాతం మంది కొనుగోలు చేస్తుంటారు.
టయోటా ఇన్నోవా హైక్రాస్ వెహికల్ కావాలంటే 15 నెలలు ఆగాల్సిందే.
ఈ వెయిటింగ్ పీరియడ్ రేంజ్-టాపింగ్ హైబ్రిడ్ వేరియంట్‌లకు వర్తిస్తుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్
టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 18.82 లక్షల నుంచి 30.26 లక్షల వరకు ఉంది.
ఇది LED లైటింగ్ సెటప్, 18-అంగుళాల డిజైనర్ చక్రాలను కలిగి ఉంది.
ఈ సెవెన్-సీటర్ క్యాబిన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ వెహికల్ కావాలంటే 15 నెలల వరకు వేచి ఉండాల్సిందే.
Details
కియా కేరెన్స్ లో ఆరు ఎయిర్ బ్యాగులు
కియా కేరెన్స్
కియా కేరెన్స్ రూ. రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.45 లక్షల మధ్య ఉంది.
ఇది పొడవాటి బానెట్, స్ప్లిట్-స్టైల్ DRLలతో బంపర్-మౌంటెడ్ LED హెడ్‌లైట్లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ను పొందుతుంది.
ఈ వెహికల్‌కు 6 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది.
మహీంద్రా XUV700
మహీంద్రా XUV700 14.03 లక్షల నుంచి రూ. 26.57 లక్షల మధ్య ఉంది. ఇందులో క్రోమ్-స్లాట్డ్ గ్రిల్, అడాప్టివ్ LED హెడ్‌లైట్లు, 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
సెవెన్-సీటర్ క్యాబిన్‌లో యాంబియంట్ లైటింగ్, 12-స్పీకర్ సోనీ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. దీని వెయింట్ 9 నెలల వరకు ఉంది.
Details
మారుతీ సుజుకి ఇన్విక్టో ప్రారంభ ధర రూ. 24.82 లక్షలు
టాటా సఫారి
టాటా సఫారీ ప్రారంభ ధర రూ. 16.19 లక్షల నుంచి రూ. 27.34 లక్షల వరకు ఉంది.
ఇందులో పారామెట్రిక్ డిజైన్ అంశాలు, ప్రొజెక్టర్ బై-LED హెడ్‌లైట్‌లు, సీక్వెన్షియల్ ఇండికేటర్‌లు, 19-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో కూడిన గ్రిల్‌ను కలిగి ఉంది.
దీని కోసం 3 నుంచి 4 నెలల వరకు వేచి ఉండాల్సిందే.
మారుతి సుజుకి ఇన్విక్టో
మారుతీ సుజుకి ఇన్విక్టో రూ. 24.82 లక్షలు నుంచి రూ. 28.42 లక్షల మధ్య ఉంది. ఇందులో NEXWave గ్రిల్, ట్రై-LED DRLలతో స్వెప్ట్-బ్యాక్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.
ఈ వెహికల్ కు 6 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.