
TVS: ఎలక్ట్రిక్ స్కూటర్ల రేసులో టీవీఎస్ నెంబర్ వన్.. ఓలా రెండో స్థానం!
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ 2025లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం కొన్ని ప్రముఖ సంస్థలకు ఆశ్చర్యకర ఫలితాలను చూపించింది.
మార్చిలో టాప్‌లో నిలిచిన బజాజ్ ఆటో, ఏప్రిల్‌లో మూడో స్థానానికి జారిపోయింది. మరోవైపు, టీవీఎస్ మోటార్ కంపెనీ 19,736 యూనిట్ల అమ్మకాలతో నంబర్-1 స్థానాన్ని దక్కించుకుంది.
ఓలా ఎలక్ట్రిక్ కూడా కీలకంగా మెరుగైన ఫలితాలు సాధించింది. మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎదిగింది. ఏప్రిల్‌లో కంపెనీ 19,709 యూనిట్లను విక్రయించింది.
గమనించదగిన విషయం ఏమిటంటే, ఏ కంపెనీ కూడా 20,000 యూనిట్ల మార్కును అందుకోలేకపోయింది.
Details
13,167 యూనిట్లు అమ్ముడుపోయిన ఏథర్ ఎనర్జీ
ఇతర కంపెనీల ఏప్రిల్ అమ్మకాలను చూస్తే బజాజ్ ఆటో 19,001 యూనిట్లు, ఏథర్ ఎనర్జీ 13,167, హీరో మోటోకార్ప్ 6,123, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 4,000, పర్ ఎనర్జీ 1,449, బగాస్ ఆటో 1,311, కైనిటిక్ గ్రీన్ 1,306, రివర్ ఎనర్జీ 1,449 యూనిట్లు విక్రయించాయి.
టీవీఎస్ కంపెనీ, మార్కెట్లో తన ప్రాబల్యాన్ని మరింత పెంచేందుకు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు అప్డేటెడ్ వేరియంట్‌ను విడుదల చేయనున్నది.
ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది.
ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
వీటి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.04 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.1.60 లక్షల వరకు ఉంటుంది.