LOADING...
VinFast: భారత NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన విన్ ఫాస్ట్ VF6,VF7  
భారత NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన విన్ ఫాస్ట్ VF6,VF7

VinFast: భారత NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన విన్ ఫాస్ట్ VF6,VF7  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ వినియోగదారులకు భద్రతపరంగా మరో రెండు ఉత్తమ ఎంపికలు లభించాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'విన్ ఫాస్ట్' తన SUV శ్రేణిలో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచింది. ఇటీవల జరిగిన భారత్ NCAP క్రాష్ టెస్టులులో విన్ ఫాస్ట్ VF6, VF7 రెండు మోడళ్లు 5-స్టార్ రేటింగ్ తో పాస్ అయ్యాయి. పెద్దల రక్షణ (Adult Occupant Protection)తో పాటు చిన్నారుల భద్రత (Child Occupant Protection)లోనూ ఈ ఎస్‌యూవీలు అద్భుతమైన ఫలితాలను చూపించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

వివరాలు 

విన్ ఫాస్ట్ వీఎఫ్​7: రక్షణలో మేటి..

2025లో నిర్వహించిన NCAP పరీక్షల్లో 2,493 కిలోల బరువు ఉన్న VF7 SUV భద్రతలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. పెద్దల భద్రత: మొత్తం 32 పాయింట్లలో 28.54 పాయింట్లు సాధించడమే కాకుండా, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో 16కి 16 పాయింట్లు పొందడం విశేషం. పిల్లల భద్రత: 49 పాయింట్లలో 45.25 పాయింట్లను సాధించింది. 18 నెలల మరియు 3 సంవత్సరాల వయసున్న చిన్నారులకు అత్యుత్తమ రక్షణ కల్పిస్తున్నట్లు పరీక్షలు చూపించాయి. భద్రతా ఫీచర్లు: VF7 లో ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ చెస్ట్, సైడ్ పెల్విస్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉన్నాయి. అదనంగా ESC, Pedestrian Protection System వంటి ఫీచర్లు ప్రయాణికుల రక్షణకు కీలకంగా పనిచేస్తాయి.

వివరాలు 

విన్ ఫాస్ట్ వీఎఫ్​6: బడ్జెట్‌లో భద్రత..

VF7 తరహాలోనే VF6 SUV కూడా 5-స్టార్ రేటింగ్ సాధించింది. 2,252 కిలోల బరువు కలిగిన ఈ వాహనం కుటుంబాల కోసం అత్యంత సురక్షిత ఎంపికగా నిలిచింది. స్కోరు వివరాలు: పెద్దల రక్షణలో 27.13 (32కి), పిల్లల రక్షణలో 44.41 (49కి) పాయింట్లు సాధించింది. సైడ్ ఇంపాక్ట్: Side Movable Deformable Barrier టెస్ట్‌లో 16కి 16 పాయింట్లు సాధించడం, పక్కనుంచి వచ్చే ప్రమాదాల్లో ప్రయాణికులు సురక్షితంగా ఉంటారని నిరూపించింది. సేఫ్టీ కిట్: VF7 వలె, VF6 SUVలో కూడా అన్ని రకాల ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, సీట్ బెల్ట్ రిమైండర్లు ఉన్నాయి.

Advertisement

వివరాలు 

విన్ ఫాస్ట్ వీఎఫ్​7, వీఎఫ్​6 సాధించిన 5-స్టార్ రేటింగ్

"VF7, VF6 సాధించిన 5-స్టార్ రేటింగ్, కస్టమర్ల భద్రతపై మా నిబద్ధతకు స్పష్టమైన సాక్ష్యం. విలాసం, టెక్నాలజీ మాత్రమే కాదు, ప్రాణ రక్షణలో కూడా మేము రాజీ పడమని ఈ ఫలితాలు చూపిస్తున్నాయి" అని విన్ ఫాస్ట్ ప్రతినిధులు తెలిపారు. డిసెంబర్ 2025 నాటికి ఎలక్ట్రిక్ కారు సేల్స్‌లో Hyundai, Kiaని వెనక్కి నెట్టిన విన్ ఫాస్ట్, ఈ NCAP క్రాష్ టెస్ట్ ఫలితాల ద్వారా భారత మార్కెట్లో తన ప్రదర్శనను మరింత బలపరచే అవకాశం పొందింది.

Advertisement