LOADING...
VinFast Limo Green Electric MPV: విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్.. 2026లో భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ MPV ఎంట్రీ!
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్.. 2026లో భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ MPV ఎంట్రీ!

VinFast Limo Green Electric MPV: విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్.. 2026లో భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ MPV ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

వియత్నాం కార్ల యాజమాన్యం విన్‌ఫాస్ట్ భారతదేశంలో తమ తదుపరి ప్రధాన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుందని ప్రకటించింది. ఈ కొత్త MPV విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ పేరుతో రానుంది. ఇది విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టబోయే మూడవ ఎలక్ట్రిక్ మోడల్‌గా నిలుస్తుంది. కంపెనీ ఈ మోడల్‌ను 2026 ఫిబ్రవరిలో భారత మార్కెట్‌కు అధికారికంగా పరిచయం చేయనుంది. విడుదల తరువాత, లిమో గ్రీన్ కియా కారెన్స్, క్లావిస్ EV, BYD eMax 7, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి MPV మోడళ్లతో పోటీ పడనుంది.

Details

డిజైన్ అంశాలు 

లిమో గ్రీన్‌లో విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ V-ఆకారపు గ్రిల్ ఉంటుంది. MPVశైలిలో రూపొందించిన బాడీ ప్యానెల్స్ పక్కనుంచి స్మూత్‌గా కట్ చేయబడ్డాయి. గాలి ప్రతిఘటనను తగ్గించడానికి ఏరో కవర్‌లతో అలాయ్ వీల్స్ అందించనున్నారు. భారత మార్కెట్ కోసం లోకల్ తయారీకి ప్రాధాన్యం ఇస్తూ ధరను పోటీగా ఉంచడం లక్ష్యం. లిమో గ్రీన్ ప్రీమియమ్ లుక్‌తో విస్తృతమైన అంతర్గత స్థలాన్ని అందిస్తుంది. 2+3+2 సీటింగ్ లేఅవుట్ ద్వారా మొత్తం 7 మంది సౌకర్యంగా కూర్చోవచ్చు. 10.1అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,4-స్పీకర్ ఆడియో సిస్టమ్, సింగిల్-జోన్ ఆటోమేటిక్ AC, అనేక USBఛార్జింగ్ పోర్టులు లభిస్తాయి. ఈ మోడల్‌కు సంబంధించిన పేటెంట్ విన్‌ఫాస్ట్ ఇప్పటికే భారత్‌లో పొందింది, కాబట్టి భారత వెర్షన్ కూడా ఈ డిజైన్‌కు సమీపంగా ఉంటుంది.

Details

సైజు & భద్రతా వివరాలు 

వాహనం పొడవు 4,740 mm, వెడల్పు 1,872 mm, ఎత్తు 1,728 mm, వీల్‌బేస్ 2,840 mm. భద్రతా అంశాలపై కూడా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ప్రకటించింది.

Advertisement