LOADING...
VinFast: ఇండియన్ ఈవీ మార్కెట్‌లో 'విన్‌ఫాస్ట్' దూకుడు.. మూడు మోడళ్ల లాంచ్‌కు ప్లాన్!
ఇండియన్ ఈవీ మార్కెట్‌లో 'విన్‌ఫాస్ట్' దూకుడు.. మూడు మోడళ్ల లాంచ్‌కు ప్లాన్!

VinFast: ఇండియన్ ఈవీ మార్కెట్‌లో 'విన్‌ఫాస్ట్' దూకుడు.. మూడు మోడళ్ల లాంచ్‌కు ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 డిసెంబర్ ఈవీ అమ్మకాల గణాంకాల్లో హ్యుందాయ్, కియా మోటార్స్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానాన్ని దక్కించుకున్న వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్ ఇప్పుడు భారత మార్కెట్‌పై తన పట్టును మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత్‌లో వీఎఫ్6, వీఎఫ్7 మోడళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, 2026లో మొత్తం మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటిలో ఒకటి ఫ్యామిలీ వినియోగానికి అనువైన ఎలక్ట్రిక్ ఎంపీవీ కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో విన్‌ఫాస్ట్ తీసుకురానున్న కొత్త ఎలక్ట్రిక్ మోడళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Details

విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ కార్లు

1. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్: పెద్ద కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్ కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి, ట్రావెల్ బిజినెస్ చేసే వారికి విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలవనుంది. ఇది మూడు వరుసల సీటింగ్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఎంపీవీ. లాంచ్ టైమ్ 2026తొలి త్రైమాసికంలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ధర ఎక్స్-షోరూమ్ ధర రూ.18-20లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఫీచర్లు ఇందులో 60.1కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 201బీహెచ్‌పీ మోటార్ ఉంటాయి. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ 'V'ఆకారపు లైట్లు, ఆధునిక టచ్‌స్క్రీన్ ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. డైమెన్షన్స్ పొడవు 4,740ఎంఎం, వెడల్పు 1,872 ఎంఎం, ఎత్తు1,728 ఎంఎం.

Details

2. విన్‌ఫాస్ట్ వీఎఫ్3: నగర ప్రయాణాలకు సరిగ్గా సరిపడే ఈవీ

నగర ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించేందుకు రూపొందించిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ విన్‌ఫాస్ట్ వీఎఫ్3. పరిమాణంలో చిన్నదిగా కనిపించినా పనితీరులో మాత్రం శక్తివంతంగా ఉంటుంది. ధర రూ.8-10 లక్షల బడ్జెట్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి రానుంది ప్రత్యేకతలు 191 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా సాఫీగా నడుస్తుంది. 18.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ కారు, ఫుల్ ఛార్జ్‌పై 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుంది. లాంచ్ అనంతరం ఎంజీ కామెట్ వంటి కాంపాక్ట్ ఈవీలకు ఇది గట్టి పోటీగా మారనుంది.

Advertisement

Details

3. విన్‌ఫాస్ట్ వీఎఫ్5: ఫీచర్లతో నిండిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

ఇప్పటికే వియత్నాం, ఇండోనేషియా మార్కెట్లలో విజయం సాధించిన విన్‌ఫాస్ట్ వీఎఫ్5 మోడల్‌ను భారత్‌కు తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఇది టాటా పంచ్ ఈవీ కంటే పొడవుగా ఉండటంతో లోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీ ఆప్షన్లు రెండు బ్యాటరీ వేరియంట్లలో లభించనుంది. ఒకటి 268 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగా, రెండోది 326 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. లగ్జరీ ఫీచర్లు 8 అంగుళాల టచ్‌స్క్రీన్, లెదర్ సీట్లు, కీ-లెస్ ఎంట్రీ, గాలిని శుద్ధి చేసే పీఎం2.5 ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. మొత్తంగా చూస్తే, 2026లో భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో విన్‌ఫాస్ట్ ఒక కొత్త విప్లవాన్ని తీసుకురాబోతోంది.

Advertisement