Page Loader
కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల
కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల

కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 21, 2023
06:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా భారతదేశంలో తన Fascino 125 Fi హైబ్రిడ్, Ray ZR 125 Fi హైబ్రిడ్ స్కూటర్ల 2023 వెర్షన్‌లను విడుదల చేసింది. రెండు వాహనాలు కొత్త రంగు ఆప్షన్స్ తో, OBD-II సెన్సార్‌తో వస్తున్నాయి. 125cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ తో నడుస్తాయి. భారతీయ మార్కెట్లో, యమహా అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి. 2023 సంవత్సరానికి, సంస్థ తన Fascino 125 Fi హైబ్రిడ్, Ray ZR 125 Fi హైబ్రిడ్ స్కూటర్‌లను కొత్త రంగులు, ఫీచర్లతో అప్‌డేట్ చేసింది వాటి ధరలను కూడా పెంచింది. అయితే, ఇది వాహనాల అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

స్కూటర్

యమహా Fascino, Ray ZR లు E-20 ఫ్యూయల్-కంప్లైంట్ తో వస్తాయి

ఇవి డార్క్ మ్యాట్ బ్లూ, మ్యాట్ బ్లాక్, లైట్ గ్రే వెర్మిలియన్‌తో సహా కొత్త రంగులలో అందుబాటులో ఉన్నాయి. యమహా Fascino, Ray ZR లు E-20 ఫ్యూయల్-కంప్లైంట్, 125cc, సింగిల్-సిలిండర్, ఎలక్ట్రిక్ మోటార్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయిన ఎయిర్-కూల్డ్ మిల్లుపై నడుస్తాయి. యమహా Fascino, Ray ZRలలో ఫ్రంట్ వీల్‌పై డిస్క్/డ్రమ్ బ్రేక్, వెనుక చక్రంలో డ్రమ్ బ్రేక్, రోడ్లపై మెరుగైన హ్యాండ్లింగ్ కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. 2023 యమహా Fascino 125 Fi హైబ్రిడ్ ప్రారంభ ధర రూ. 78,600 నుండి రూ.91,030. Ray ZR 125 Fi హైబ్రిడ్ ధర రూ. 82,730-రూ.93,530 (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).