Page Loader
25వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన యమహా R1.. ప్రత్యేకతలు ఇవే! 
యమహ ఆర్1, 17-అంగుళాల కార్బన్ ఫైబర్ చక్రాలపై నడుస్తుంది

25వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన యమహా R1.. ప్రత్యేకతలు ఇవే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2023
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

యమహా ఆర్ 1 బైక్ తన 25వ వార్షికోత్సవం అడుగుపెట్టింది. ప్రస్తుతం యమహా ఆర్ 1 GYTR PROను నూతనంగా ఆవిష్కరించింది. 1998లో యమహా తన బైక్ ను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. యమహా కొత్త బైకులో డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఏరోడైనమిక్ ఫుల్-ఫెయిరింగ్, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్, పొడవాటి "డబుల్-బబుల్" విండ్‌స్క్రీన్ లాంటివి ఉండనున్నాయి. LED టైలాంప్, ఫుల్- రంగు TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 17-అంగుళాల తేలికైన కార్బన్ ఫైబర్ వీల్స్‌పై ఈ సూపర్‌బైక్ నడవనుంది. GYTR PRO ఎలక్ట్రానిక్ సిస్టమ్ మాడ్యూల్‌ను పొందడం విశేషం.

Details

యమహా ఆర్ 1 GYTR PROలో అధునాతన ఫీచర్లు

R1 GYTR PRO 25వ వార్షికోత్సవ ఎడిషన్‌లో రెండు చక్రాలపైన బ్రెంబో-సోర్స్‌డ్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి, అలాగే రైడర్ల భద్రత కోసం ABS, సిక్స్-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్లు ఉండడం గమనార్హం. ఈ సూపర్ బైక్ 998cc, ఇన్‌లైన్-ఫోర్, 'క్రాస్‌ప్లేన్' ఇంజన్‌తో వచ్చింది. Yamaha R1 GYTR ధర రూ. 1.44 కోట్లు ఉండనుంది.ఇప్పటివరకూ ఈ సూపర్‌బైకులను 25 మాత్రమే విక్రయించాయి. Yamaha R1 GYTRలో స్ బైక్ నుండి శక్తివంతమైన 998cc, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్-ఫోర్, DOHC, 16-వాల్వ్, 'క్రాస్‌ప్లేన్' ఇంజన్ ఉండనుంది.