Yamaha Scooter: కార్ల తరహాలో సేఫ్టీ ఫీచర్.. ఎయిర్‌బ్యాగ్‌తో యమహా ట్రైసిటీ 300 ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్ సదుపాయం కలిగిన స్కూటర్‌ను యమహా మోటార్ కంపెనీ విడుదల చేసింది. ఈ నూతన మోడల్‌కు 2026 యమహా ట్రైసిటీ 300 అని పేరు. ఇది మూడు చక్రాలతో (ముందు రెండు, వెనుక ఒకటి) రూపొందిన ప్రత్యేక స్కూటర్‌గా నిలిచింది. ఈ స్కూటర్‌లో రైడర్ భద్రత కోసం బిల్ట్-ఇన్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఇది ప్రొడక్షన్‌లో విక్రయానికి అందుబాటులోకి వచ్చిన తొలి ఎయిర్‌బ్యాగ్ స్కూటర్‌గా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు స్కూటర్‌లలో ఎయిర్‌బ్యాగ్ సదుపాయం లేకపోగా, మోటార్‌సైకిళ్లలో మాత్రం హోండా గోల్డ్ వింగ్ 2006 నుంచే ఈ ఫీచర్‌ను కలిగి ఉంది.ఈ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ను స్వీడన్‌కు చెందిన ఆటోలివ్ సంస్థతో కలిసి అభివృద్ధి చేశారు.
Details
ఈ స్కూటర్‌లో పలు ఆధునిక ఫీచర్లు
ముందువైపు ఢీకొన్న ప్రమాదం(ఫ్రంటల్ క్రాష్)సంభవించినప్పుడు, ఎయిర్‌బ్యాగ్ వెంటనే విస్తరించి రైడర్‌ను హ్యాండిల్‌బార్ లేదా ఇతర గట్టి భాగాలకు ఢీకొనకుండా రక్షిస్తుంది. సాంకేతికంగా కూడా ఈ స్కూటర్‌లో పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 292cc సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్(ట్విస్ట్-అండ్-గో), లీనింగ్ త్రీ-వీల్ డిజైన్ (ముందు చక్రాలు వంగే విధానం), కార్నరింగ్ ABS, మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్, స్మార్ట్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు ఇందులో పొందుపరిచారు. ప్రత్యేకంగా నగరాల్లో ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులకు మరింత భద్రత, సౌకర్యం కల్పించడమే ఈ మోడల్ లక్ష్యంగా ఉంది. 2026తొలి అర్ధభాగంలో ఈ స్కూటర్ యూరప్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే యమహా సంస్థలోనే రైడర్ ఎయిర్‌బ్యాగ్ సదుపాయం కలిగిన మొదటి వాహనం ఇదే కావడం విశేషం.