
FDI: బీమా రంగంలో 100శాతం ఎఫ్‌డీఐ ప్రతిపాదన.. త్వరలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీమా రంగంలో కీలక మార్పులు సూచించారు. త్వరలో బీమా సవరణ బిల్లు (Insurance Amendment Bill)ను ప్రవేశపెట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ బిల్లుతో బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)కు అనుమతించే అవకాశం ఉందని తెలిపారు.
Details
బిల్లులో కీలక సవరణలు
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం, ఈ బిల్లును రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా 1938లోని బీమా చట్టంలో పలు సవరణలు చేయనున్నారు. ముఖ్యంగా: బీమా రంగంలో ఎఫ్‌డీఐను ప్రస్తుత 74% నుంచి 100%కు పెంచడం పెయిడప్ క్యాపిటల్‌ను తగ్గించడం కాంపొజిట్ లైసెన్స్ నిబంధన ప్రవేశపెట్టడం అలాగే బీమా నియంత్రణ అభివృద్ధి చట్టం 1999 లోనూ కొన్ని మార్పులు ప్రతిపాదించారు.
Details
పాలసీదారులకు లాభాలు, ఉపాధి అవకాశాలు
ఈ ప్రతిపాదిత సవరణల వల్ల బీమా మార్కెట్‌లోకి మరిన్ని కంపెనీలు రావడంతోపాటు, పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పాలసీదారుల ప్రయోజనాలు రక్షించబడటమే కాకుండా, వారి ఆర్థిక భద్రత మరింత బలోపేతం అవుతుందని ఆమె అన్నారు. అలాగే, భారత ఆర్థిక వృద్ధికి ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
Details
జీఎస్టీ సంస్కరణల ప్రస్తావన
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఇటీవల అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలపై కూడా స్పందించారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సంస్కరణలు ప్రతి భారతీయుడి విజయమని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు దీపావళి పండుగకు ముందే జీఎస్టీ మార్పులను అమలు చేయడంతో అనేక కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందని తెలిపారు. ప్రజల సాధికారత ద్వారానే భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆర్థిక మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.