LOADING...
PM Jan Dhan Accounts: దేశంలో 13 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు నిరుపయోగం
దేశంలో 13 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు నిరుపయోగం

PM Jan Dhan Accounts: దేశంలో 13 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు నిరుపయోగం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ తాజా వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా 56.04 కోట్ల పీఎం జన్‌ధన్‌ ఖాతాల్లో సుమారుగా 23 శాతం ఖాతాలు నిరుపయోగంగా ఉన్నట్లు బయటపడ్డాయి. ఈ ఏడాది జూలై 31 నాటికి 13.04 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్నాయని లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఇలాంటి ఖాతాలు ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్‌లో (2.75 కోట్లు) ఉన్నాయి. తరువాతి స్థానాల్లో బిహార్‌ (1.39 కోట్లు), మధ్యప్రదేశ్‌ (1.07 కోట్లు) ఉన్నాయి. ఆర్ బి ఐ నిబంధనల ప్రకారం, ఒక పొదుపు ఖాతాలో వినియోగదారుడి తరఫున రెండు సంవత్సరాల పాటు ఏ లావాదేవీ జరగకపోతే, ఆ ఖాతాను ఇన్‌ఆపరేటివ్‌గా పరిగణిస్తారు.

Details

నిరుపేదలకు బ్యాంకు ఖాతా కోసం జన్ ధన్ పథకం

అదేవిధంగా, యూపీఐ (UPI) సేవలపై లావాదేవీల ఛార్జీలు విధించే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర మంత్రి చౌధరీ స్పష్టం చేశారు. UPI సేవలు సజావుగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో సుమారుగా రూ.8,730 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిరుపేద భారతీయులకు బ్యాంకు ఖాతా సౌకర్యం కల్పించడానికి ప్రధానమంత్రి జన్‌ధన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభం నుండి పదేళ్లు పూర్తయ్యాయని, ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఖాతాలకు రీ-కేవైసీ చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ సంజయ్‌ మల్హోత్రా సూచించారు. రీ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు.