LOADING...
Gig workers: అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికుల రిజిస్ట్రేషన్‌కు 16 ఏళ్ల వయసు తప్పనిసరి : కేంద్రం 
అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికుల రిజిస్ట్రేషన్‌కు 16 ఏళ్ల వయసు తప్పనిసరి : కేంద్రం

Gig workers: అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికుల రిజిస్ట్రేషన్‌కు 16 ఏళ్ల వయసు తప్పనిసరి : కేంద్రం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం వర్కర్లుగా నమోదు కావాలంటే కనీసం 16 ఏళ్ల వయసు నిండిన వారే అర్హులని కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకే సామాజిక భద్రత పథకాలు వర్తిస్తాయని వెల్లడించింది. నమోదు అయిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూఏఎన్‌)తో పాటు డిజిటల్‌ ఐడీ కార్డు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు సామాజిక భద్రత కోడ్‌కు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

Details

కార్మికుల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ఇందులో అసంఘటిత, గిగ్‌, ప్లాట్‌ఫాం కార్మికులకు సామాజిక భద్రత పథకాల అమలు విధానాన్ని వివరించింది. కార్మికుల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసిన కేంద్రం, నమోదు సమయంలో కార్మికుడి వయసు 60 ఏళ్లు దాటినా లేదా ఏడాదిలో కనీసం 90 రోజులు పని చేయకపోయినా ఈ పథకాలు వర్తించవని స్పష్టం చేసింది.

Details

 రిజిస్ట్రేషన్‌ విధానం ఇలా.. 

అసంఘటిత, గిగ్‌ కార్మికులుగా కనీసం 16 ఏళ్లు నిండిన వారు సొంత డిక్లరేషన్‌పై ఆధార్‌తో పాటు ఇతర పత్రాలు సమర్పించి పేర్లు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌, పోర్టల్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పోర్టల్‌లో ఆయా రాష్ట్రాలు తమ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక యూఏఎన్‌ నంబర్‌ కేటాయించనుంది. అనంతరం కార్మికుడి ఫొటో, వ్యక్తిగత వివరాలతో కూడిన డిజిటల్‌ ఐడీ కార్డును కేంద్రం జారీ చేస్తుంది. సామాజిక భద్రత పథకాలు ప్రకటించిన తర్వాత అర్హతలకు సంబంధించిన నియమావళి కూడా అందుబాటులోకి రానుంది.

Advertisement

Details

ఒక్కరోజు పనిచేసినా అర్హత

గిగ్‌ కార్మికుడు నెలలో ఒక్కరోజు మాత్రమే పని చేసినా, అగ్రిగేటర్‌ నుంచి పొందిన ఆదాయంతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒకే రోజున వేర్వేరు అగ్రిగేటర్ల వద్ద పనిచేస్తే, ఆ రోజులను కలిపి లెక్కిస్తారు. ఉదాహరణకు ఒకే రోజున మూడు సంస్థల వద్ద పనిచేస్తే, మూడు రోజులు పని చేసినట్లుగా పరిగణిస్తారు. గిగ్‌ వర్కర్ల వివరాలను అగ్రిగేటర్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయకపోతే సంబంధిత కార్మికులు సంక్షేమ పథకాలకు అనర్హులు అవుతారని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

Details

సామాజిక భద్రతా నిధి, రీఫండ్‌ నిబంధనలు

సామాజిక భద్రతా నిధికి అగ్రిగేటర్లు అవసరానికి మించి మొత్తాన్ని జమచేస్తే, రీఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని కేంద్రం తెలిపింది. దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా రీఫండ్‌ చెల్లిస్తామని నిబంధనల్లో పేర్కొంది.

Advertisement