Bitcoin: ఒక్కరోజే 12% పతనమైన బిట్‌కాయిన్
ఈ వార్తాకథనం ఏంటి
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) ధరలో ఒక్కరోజే భారీ పతనం నమోదైంది. ధర 12% పైగా పడిపోయి 63,295 డాలర్లకు చేరింది. 2024 తరువాత ఇది ఒకరోజులో అత్యధిక పతనం అని విశ్లేషకులు పేర్కొన్నారు. ఒక దశలో బిట్‌కాయిన్ ధర 60,000 డాలర్లకూ తగ్గింది. విలువైన లోహాల మార్కెట్‌లో ఉన్న అస్థిరత, అలాగే ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు ఈ పతనానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో దాదాపు 1 బిలియన్ డాలర్ల విలువ ఉన్న బిట్‌కాయిన్ పొజిషన్లను మదుపర్లు వెనక్కి వదిలినట్లు క్రిప్టో కరెన్సీ యాప్ కాయిన్‌గ్లాస్ (CoinGlass) డేటా వెల్లడించింది.
వివరాలు
స్టాక్ మార్కెట్‌లో నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 323 పాయింట్ల కోతతో 82,990 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 25,525 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, టీఎంపీవీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే టెక్ మహీంద్రా, టీసీఎస్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఇన్ఫోసిస్, ఎటర్నల్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.25 వద్ద స్థిరంగా ఉంది.