
UPI: రుసుము పెడితే యూపీఐ వాడం..లోకల్ సర్కిల్స్ సర్వేలో అధికుల అభిప్రాయం
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)పద్ధతి రోజువారీ ఆర్థిక లావాదేవీలలో అత్యధికంగా ఉపయోగించబడుతుంది.
టీ బడ్డీ నుంచి హాస్పిటల్స్‌లో బిల్లుల చెల్లింపు వరకు విస్తృతంగా వాడుకుంటున్నారు.క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా మొబైల్ నంబర్ ద్వారా,ఎలాంటి రుసుములు లేకుండా వేగంగా డబ్బులు ఒకరి నుంచి మరొకరికి పంపించుకోవచ్చు.
దీనివల్ల చిల్లర సమస్య కూడా గణనీయంగా తగ్గింది.యూపీఐ లావాదేవీలపై రుసుము విధించే అవకాశం ఉండడాన్ని గుర్తించి, జులై 15 నుండి సెప్టెంబర్ 20 మధ్య 308 జిల్లాల్లో 42,000 మందిని అభిప్రాయాలు సేకరించినట్లు లోకల్ సర్కిల్స్ తెలిపింది.
వివరాలు
రుసుము ఉన్నా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం
ఈ సర్వేలో, 15,598 మంది మాత్రమే అభిప్రాయాలు ఇచ్చారు.
ఈ ప్రశ్నకు 75 శాతం మంది వినియోగదారులు "ఒకవేళ ఛార్జీలు విధించబడితే, యూపీఐ సేవలను వినియోగించడం ఆపేస్తాము" అని చెప్పారు.
కాగా 22% మంది రుసుము ఉన్నా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.