
Tuhin Kanta Pandey: ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌లో 90% రిటైల్ మదుపర్లకు నష్టం: సెబీ ఛైర్మన్
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల (Futures and Options - F&O) విభాగంలో తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలని ఆశించే రిటైల్ మదుపర్లపై కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే (Tuhin Kanta Pandey) స్పందించారు.
అతివిశ్వాసమే సంపద కోల్పోయేలా చేస్తోందని హెచ్చరించారు.
Details
90 శాతం మంది నష్టాల్లోనే
బిజినెస్ టుడే మైండ్‌రష్ 2025 ఫోరమ్‌లో పాల్గొన్న పాండే.. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.
సెబీ అధ్యయనాల ప్రకారం, డెరివేటీవ్స్ విభాగంలో 90 శాతం మంది రిటైల్ మదుపర్లు డబ్బు కోల్పోతున్నారని వెల్లడించారు.
ట్రేడింగ్ సామర్థ్యాలను అతిగా అంచనా వేసుకునే మదుపర్లు ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు.
ముఖ్యంగా గడువు ముగిసే రోజుల్లో (expiry days) చివరి నిమిషాల్లో మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల అస్థిరత పెరుగుతోందన్నారు.
Details
సెబీ చర్చాపత్రం విడుదల
ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌లో రిటైల్ మదుపర్లను పరిరక్షించేందుకు సెబీ ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసినట్లు పాండే తెలిపారు.
పరిశ్రమ వర్గాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పరిష్కార మార్గాలపై పనిచేస్తున్నామని వివరించారు.
రిటైల్ మదుపర్ల భద్రతకు ఉత్తమ పద్ధతులు
స్టాక్ మార్కెట్ స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు, రిటైల్ మదుపర్ల భద్రతను మరింత పెంపొందించేందుకు సెబీ అనేక చర్యలు తీసుకుంటోందని పాండే తెలిపారు.
ప్రపంచస్థాయిలో ఉత్తమ ప్రమాణాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.