పెద్ద నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 93 శాతం నోట్లు వెనక్కి
పెద్ద నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకుల్లో జమైనట్లు శుక్రవారం ప్రకటించింది ప్రజల వద్ద కేవలం రూ.24 వేల కోట్ల రూ. 2000 నోట్లు మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది.నోట్ల మార్పిడికి సెస్టెంబర్ 30 వరకు గడువు విధించింది. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 ఆఖరి తేదీగా కేంద్రం నిర్ణయించింది. అన్ని డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాదారులు సెప్టెంబర్ 30లోగా నామినీని తప్పనిసరిగా నమోదు చేయాలి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు రివార్డ్‌లను తగ్గిస్తూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచే మాగ్నస్ కార్డుదారులకు అధిక ఛార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించింది.