Rs 2000 Notes: 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కొత్త అప్‌డేట్.. అదేంటంటే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఇటీవల ఒక కీలక సమాచారం విడుదల చేసింది. 2000 రూపాయల బ్యాంకు నోట్లను డిపాజిట్ చేసే లేదా మార్చుకునే సదుపాయం 7 అక్టోబర్ 2023 వరకు అన్ని బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంటుంది. ఈ నోట్లను మార్చుకునే సదుపాయం RBIకి చెందిన 19 ఇష్యూ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం, 2000 రూపాయల నోట్లలో 97.96 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు RBI తెలిపింది. అయితే, ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7261 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ 19 మే 2023న 2000 రూపాయల నోట్ల ఉపసంహరణను ప్రకటించింది.
97.96 శాతం నోట్లు బ్యాంకుల్లో జమ
ఆ సమయంలో, మొత్తం చెలామణిలో ఉన్న రూ.3.56 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లలో 97.96 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్టు వెల్లడించింది. ప్రస్తుతం, ఈ నోట్ల విలువ రూ.7261 కోట్లకు తగ్గిపోయింది.ఈ నోట్లను డిపాజిట్ చేసేందుకు లేదా మార్చుకోవడానికి 7 అక్టోబర్ 2023 వరకు అందుబాటులో ఉండే సదుపాయం ఆర్‌బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో కూడా కలదు. 9 అక్టోబర్ 2023 నాటికి, RBI ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు,సంస్థల నుండి 2000 రూపాయల నోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి స్వీకరిస్తాయి.
డిపాజిట్ చేసేందుకు ఇంకా అవకాశం
అలాగే, దేశంలోని ఏ పోస్టాఫీసు ద్వారా అయ్యినా కూడా 2000 రూపాయల నోట్లను RBI ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం వంటి నగరాలలో 19 RBI కార్యాలయాలు ఉన్నాయి. 2016 నవంబర్లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు.