LOADING...
Cognizant: దిగ్గజ ఐటీ కంపెనీలో కీలక మార్పు.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు!
దిగ్గజ ఐటీ కంపెనీలో కీలక మార్పు.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు!

Cognizant: దిగ్గజ ఐటీ కంపెనీలో కీలక మార్పు.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2025
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 58 సంవత్సరాల వయసును 60కి పెంచింది. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులకు అంతర్గత మెమో ద్వారా తెలియజేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయం భారత్‌లోని అన్ని కాగ్నిజెంట్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుందని సమాచారం. ఐటీ రంగంలో అనేక సంస్థలు తమ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్లుగా కొనసాగిస్తున్నాయి. అయితే కాగ్నిజెంట్‌ ఈ వయస్సును 60కి పెంచుతూ, అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను మరింత సద్వినియోగం చేసుకోవడం కోసం ఈ మార్పు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

Details

కాగ్నిజెంట్‌లో 2.50 లక్షలమంది ఉద్యోగులు

గ్లోబల్‌ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో భారత్‌ ప్రాధాన్యత పెరుగుతున్న విషయంపై కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ వ్యాఖ్యానించారు. 'కాగ్నిజెంట్‌కు భారత్‌లో 2.50 లక్షల మంది ఉద్యోగులన్నారని, మునుపటి వరకు కాగ్నిజెంట్‌ కార్యాలయాలు పెద్ద నగరాల్లోనే ఉండేవన్నారు. ఇప్పుడు చిన్న పట్టణాలకూ కూడా విస్తరిస్తున్నామన్నారు. ఇందౌర్‌లో కూడా కార్యాలయం ప్రారంభించామని, భారత్‌ కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాబోయే దశాబ్దంలో భారత్‌ ప్రపంచ సాంకేతిక కేంద్రంగా మారనుందని రవి కుమార్‌ అన్నారు.