LOADING...
Flipkart: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ నుంచి నిష్క్రమించిన ఫ్లిప్‌కార్ట్ 
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ నుంచి నిష్క్రమించిన ఫ్లిప్‌కార్ట్

Flipkart: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ నుంచి నిష్క్రమించిన ఫ్లిప్‌కార్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన పెట్టుబడుల విభాగం,ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌ లిమిటెడ్‌ (ABFRL) నుంచి పూర్తిగా నిష్క్రమించింది. బుధవారం నాడు,ఫ్లిప్‌కార్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తమ వద్ద ఉన్న మొత్తం 6 శాతం వాటాలను బ్లాక్‌ డీల్‌ రూపంలో విక్రయించింది. ఈ పరిణామంతో ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ షేర్లు ఒక దశలో 11 శాతం పడిపోయి రూ.76.94 వద్దకి చేరాయి. అయితే ఆపై కొంతమేర కోలుకొని,మధ్యాహ్నం 1:34కి ఈ షేర్లు 8.64 శాతం నష్టంతో రూ.77.36 వద్ద ట్రేడవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ గ్రూప్‌కు చెందినది.దీనికి అనుబంధంగా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఈ బ్లాక్‌ డీల్స్‌లో భాగంగా 7.31 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.79.50 ధర వద్ద విక్రయించింది.

వివరాలు 

బ్లాక్‌ డీల్‌కు రన్నర్‌గా వ్యవహరించిన  గోల్డ్‌మన్‌ శాక్స్‌ బుక్‌ 

ఇది నిన్నటి ముగింపు ధర అయిన రూ.86తో పోల్చితే సుమారు 7.6శాతం తక్కువ ధర. ఈబ్లాక్‌ డీల్‌కు గోల్డ్‌మన్‌ శాక్స్‌ బుక్‌ రన్నర్‌గా వ్యవహరించింది.ఈ ఒప్పందంలో భాగంగా ఏ కొత్త షేర్లు జారీ చేయలేదు. ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ ఇప్పటికే 2020 అక్టోబర్‌లో ఈ సంస్థ నుంచి రూ.1,500కోట్ల పెట్టుబడి పొందింది. ఇటీవల ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ 2025 నెవ్వరిత్రైమాసికానికి గాను రూ.23.55 కోట్ల నష్టాన్నిప్రకటించింది. ఇదిగత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.266.36 కోట్ల నష్టంతో పోలిస్తే చాలా తక్కువ. ఇక ఆపరేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం కూడా గణనీయంగా పెరిగి రూ.1,719 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఆదిత్యబిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌ లిమిటెడ్‌ చేతిలో పాంటలూన్స్‌,వాన్ హ్యూసెన్‌,లూయిస్ ఫిలిప్‌ వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి.