NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / భారీ నష్టాలకు అదానీ షేర్లను విక్రయిస్తున్న ఐహెచ్ సీ
    తదుపరి వార్తా కథనం
    భారీ నష్టాలకు అదానీ షేర్లను విక్రయిస్తున్న ఐహెచ్ సీ
    భారీ నష్టాలకు అదానీ షేర్లను విక్రయిస్తున్న ఐహెచ్ సీ

    భారీ నష్టాలకు అదానీ షేర్లను విక్రయిస్తున్న ఐహెచ్ సీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 29, 2023
    05:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ (IHC) భారీ నష్టాలకు తమ షేర్లను విక్రయించనుంది.

    18 నెలల్లోనే అబుదాబికి చెందిన ఈ సంస్థ అదానీకి చెందిన 3 గ్రూపు కంపెనీల్లో రూ.15,400 కోట్లు (2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టింది.

    వాటిలో అదానీ గ్రీన్ ఎనర్జీలో రూ.3,850 కోట్లు, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లో రూ.3,850 కోట్లు, అదానీ ఎంటర్ ప్రైజెస్ లో రూ.7,700 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టింది.

    తాజాగా అదానీ గ్రీన్ లో 1.26 శాతం వాటా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లో 1.41 శాతం వాటాను విక్రయించనున్నామని అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కు సమాచారం ఇచ్చింది.

    details

    ఎంత విలువకు విక్రయించేదీ కంపెనీ వివరించలేదు

    ఈ రెండు కంపెనీల్లో తనకున్న పెట్టుబడులను విక్రయించేందుకు కొనుగోలుదారుతో ఒప్పందానికి వచ్చామని కంపెనీ పేర్కొంది. అయితే ఎంత విలువకు విక్రయించేదీ వివరించలేదు.

    అదానీ గ్రూపులో ఈ సంస్థకు 3.53 శాతం వాటా ఉండగా. ప్రస్తుతం రూ.9,937 కోట్లుగా విలువ పలుకుతోంది. రూ.7,700 కోట్ల పెట్టుబడిపై వాటా విక్రయిస్తే 29 శాతం లాభాలు వచ్చే అవకాశం ఉంది.

    మరోవైపు అదానీలో అవకతవకలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ జనవరిలో విడుదల చేసిన నివేదికలు ప్రకంపణలు సృష్టించాయి.

    ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా పడిపోయాయి. అదానీ ఎనర్జీ గరిష్ఠ ధర నుంచి 47 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది.అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సైతం 70 శాతం తక్కువలో ట్రేడ్ అవుతుండటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    అదానీ గ్రూప్

    తాజా

    Accenture promotions: యాక్సెంచర్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌: 50 వేలమందికి ప్రమోషన్లు  యాక్సెంచర్‌
    AM Ratnam : ఖుషి నుండి హరిహర వీరమల్లు వరకూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం చాలా గొప్పది : ఏఎం రత్నం  హరిహర వీరమల్లు
    Puja Khedkar: మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  పూజా ఖేద్కర్‌
    Kumki Elephants: ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే.. పవన్ కళ్యాణ్

    స్టాక్ మార్కెట్

    అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి అదానీ గ్రూప్
    పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా అదానీ గ్రూప్
    హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించిన గౌతమ్ అదానీ అదానీ గ్రూప్

    అదానీ గ్రూప్

    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ గౌతమ్ అదానీ
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025