Adani Airport: ప్రపంచంలో మూడో అత్యంత విలువైన విమానాశ్రయ సంస్థగా అదానీ ఎయిర్‌పోర్ట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ విమానాశ్రయ నిర్వహణ రంగంలో అదానీ గ్రూప్ మరో కీలక ఘనత సాధించింది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ (AAHL) ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన విమానాశ్రయ నిర్వహణ సంస్థగా నిలిచింది. అంతర్జాతీయ,దేశీయ పెట్టుబడిదారుల నుంచి తాజాగా 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9,500 కోట్లు) ఈక్విటీని సమీకరించడంతో సంస్థ విలువ గణనీయంగా పెరిగింది. ఈ పెట్టుబడుల లావాదేవీకి ముందు అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ విలువ 18 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.71 లక్షల కోట్లు)గా ఉంది. తాజాగా 1 బిలియన్ డాలర్ల మేర కొత్త మూలధనం అందడంతో సంస్థ విలువ 19 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.80 లక్షల కోట్లు) చేరింది.
వివరాలు
ఈ రెండూ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీలే..
ఈ విలువ ఆధారంగానే ప్రపంచంలోని అత్యంత విలువైన విమానాశ్రయ నిర్వహణ సంస్థల్లో అదానీ ఎయిర్‌పోర్ట్స్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం ఈ జాబితాలో స్పెయిన్‌కు చెందిన ఏనా (Aena) 46 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.37 లక్షల కోట్లు) విలువతో అగ్రస్థానంలో ఉంది.
27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.56 లక్షల కోట్లు) విలువతో ఎయిర్‌పోర్ట్స్ ఆఫ్ థాయ్‌లాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఏనా,ఎయిర్‌పోర్ట్స్ ఆఫ్ థాయ్‌లాండ్ రెండూ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీలే.
అంటే అవి తమతమ దేశాల స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉన్నాయి.
అదానీ ఎయిర్‌పోర్ట్స్ మాత్రం స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాలేదు. ఇది అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆధీనంలో ఉన్న ప్రైవేట్లీ హెల్డ్ సంస్థ.
వివరాలు
1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు:
అందువల్ల ఏనా, ఎయిర్‌పోర్ట్స్ ఆఫ్ థాయ్‌లాండ్ మాదిరిగా అదానీ ఎయిర్‌పోర్ట్స్ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నేరుగా ట్రేడింగ్ కావు.
అదానీ ఎయిర్‌పోర్ట్స్ తాజాగా సమీకరించిన 1 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు పలు ప్రముఖ సంస్థల నుంచి వచ్చాయి.
టెమాసెక్, బ్లాక్‌రాక్ నిర్వహణలోని ఫండ్లు,ఆల్ఫావేవ్ గ్లోబల్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఇందులో భాగస్వాములయ్యాయి.
లావాదేవీ పూర్తయిన తర్వాత ఈ పెట్టుబడిదారులందరికీ కలిపి అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌లో 5.54 శాతం వాటా లభించనుంది.
ఈ తాజా పెట్టుబడితో అదానీ ఎయిర్‌పోర్ట్స్ విలువ 19 బిలియన్ డాలర్లకు చేరడం విమానాశ్రయ వ్యాపారంలో సంస్థకు ఉన్న ప్రాధాన్యాన్ని మరింత పెంచింది.
ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానాశ్రయ నిర్వహణ సంస్థల సరసన అదానీ ఎయిర్‌పోర్ట్స్ చేరడానికి ఈ లావాదేవీ కీలకంగా మారింది.