టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్
ఈ వార్తాకథనం ఏంటి
టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ తెలిపింది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ ఓడరేవుల నుండి ఇంధనం వరకు వ్యాపారాన్ని విస్తరించి ఇప్పుడు మీడియా కంపెనీని కూడా కొనుగోలు చేసారు. కానీ టెలికాం రంగానికి మాత్రం దూరంగా ఉండిపోయారు.
ఈ రంగంలో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ జియో 2016లో అరంగేట్రం చేసినప్పటి నుండి తక్కువ-ధర సేవలను అందించడం ద్వారా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
టెలికామ్‌లో తమకు ఎలాంటి ప్రణాళికలు లేవని ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషీందర్ సింగ్ తెలిపారు.
వ్యాపారం
$27మిలియన్ల విలువైన ఎయిర్‌వేవ్‌లను కొన్న అదానీ గ్రూప్
అదానీ ఎంటర్‌ప్రైజెస్ యూనిట్ అదానీ డేటా నెట్‌వర్క్స్ గత ఏడాది దేశంలో జరిగిన 5G వేలంలో దాదాపు $27 మిలియన్ల విలువైన ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేసింది.
అయితే కంపెనీ వినియోగదారుల సేవలను అందించడానికి ప్లాన్ చేయడం లేదని బదులుగా ప్రైవేట్ 5G నెట్‌వర్క్ రంగంలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన సృష్టం చేసారు.
ఈ నెలాఖరులో ప్రారంభించనున్న ప్రతిపాదిత మెగా $2.5 బిలియన్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO), మూలధన వ్యయం, యూనిట్లలో రుణాన్ని చెల్లించడానికి ఉపయోగించబడుతుందని ayanaఆయన అభిప్రాయపడ్డారు.