2022వ సంవత్సరం ప్రపంచ కుబేరుల లిస్ట్ లోకి గౌతమ్ అదానీ
గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల స్థాయికి ఎదిగారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్ టెన్‌లో ఈ ఏడాది తన సంపదను పెంచుకున్న ఏకైక వ్యక్తి కూడా అదానీ మాత్రమే. అదానీ 2022లో ఇప్పటి వరకు తన సంపదకు $44.6 బిలియన్లను జోడించారు. బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఇతర తొమ్మిది బిలియనీర్లు ఈ సంవత్సరం $259.3 బిలియన్లను కోల్పోయారు. మొత్తంమీద, ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు ఈ సంవత్సరం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో Rs.8.55 లక్షల కోట్లు సంపాదించాయి. ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ $165 బిలియన్లతో మొదటి స్థానంలో ఉండగా ఎలోన్ మస్క్ $138 బిలియన్లతో రెండవ స్థానంలో ఉన్నారు. భారతదేశం చెందిన అదానీ $121 బిలియన్లతో మూడవ స్థానంలో ఉన్నారు.
గౌతమ్ అదానీకి ఈ 2022 ఒక అద్భుతమైన సంవత్సరం
ఇప్పటివరకు గౌతమ్ అదానీ ఓడరేవులు, నిర్మాణం, మీడియా, ఇంధన వ్యాపారాలలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2030కి సోలార్ మాడ్యూల్స్,విండ్ టర్బైన్‌లు, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌లను తయారు చేసేందుకు మూడు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని సెప్టెంబర్‌లో అదానీ $70 బిలియన్ల ఇంధన ప్రణాళికను ప్రకటించారు. సెప్టెంబరులో హోల్సిమ్ నుండి ACC, అంబుజా సిమెంట్స్‌ను $10.5 బిలియన్ల కొనుగోలు చేయడం అదానీ గ్రూప్‌కి ఈ సంవత్సరంలో అతిపెద్ద డీల్. రెండు కంపెనీలు కలిసి, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా అదానీ గ్రూప్‌ను నిలబెట్టింది. మొత్తం మీద, గౌతమ్ అదానీకి ఇది ఒక అద్భుతమైన సంవత్సరం. $77 బిలియన్ల సంపదతో ప్రారంభించి ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యే స్థాయికి ఎదిగారు.