Adani Group: సెబీ నోటీసు తర్వాత దెబ్బతిన్న అదానీ గ్రూప్ షేర్లు.. కొనసాగుతున్న క్షీణత
స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకుల మధ్య అదానీ గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. అదానీ పవర్ నుంచి టోటల్ గ్యాస్ వరకు షేర్లలో భారీగా పతనం అయ్యింది. అదానీ షేర్లు పతనానికి కారణం సెబీ షోకాజ్ నోటీసు. ఈరోజు మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి అదానీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అదానీ పవర్ 3.28 శాతం క్షీణించి రూ.584.85కి చేరుకుంది.అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా 4.27 శాతం తగ్గి రూ.2865.50 వద్ద ట్రేడవుతోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా ఎరుపు రంగులో ఉంది. 1.93 శాతం తగ్గి రూ.1765కి చేరింది. అదానీ పోర్ట్స్‌లో 4.47 శాతం క్షీణత ఉంది. 1261.30 వద్ద ఉంది.
సెబీ ఎందుకు నోటీసు ఇచ్చింది
అదానీ టోటల్ గ్యాస్ కూడా 2.54 శాతం తగ్గి రూ.906.80కి చేరుకుంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్‌లో రెండు శాతానికి పైగా క్షీణత ఉంది. 1039.70 వద్ద ఉంది. అదానీ విల్మార్ 2శాతం క్షీణించి రూ.337.35 వద్ద ఉంది.ACC,అంబుజా సిమెంట్ మరియు NDTV షేర్లు కూడా దెబ్బతిన్నాయి. సంబంధిత పార్టీ లావాదేవీలను ఉల్లంఘించినందుకు, లిస్టింగ్ నిబంధనలను పాటించనందుకు ఆరు అదానీ గ్రూప్ కంపెనీలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుండి షోకాజ్ నోటీసులు అందుకున్నాయి. షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 2023లో అదానీ గ్రూప్‌పై కార్పొరేట్ మోసం,షేర్ ధరల తారుమారుపై తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత జరిపిన విచారణలో భాగంగా ఈ ఆరు కంపెనీలకు సెబీ నోటీసు ఇచ్చింది.
FY 2023-24 ఆర్థిక ఫలితాలను వెల్లడి
సెబీ నోటీసు ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్,అదానీ విల్మార్ తమ సంబంధిత జనవరి-మార్చి త్రైమాసికం, FY 2023-24 ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి.