LOADING...
Swiggy: నిన్న జొమాటో ఇవాళ స్విగ్గీ.. ప్రతి ఆర్డర్‌కి ప్లాట్‌ఫాం ఫీజు పెంపు 
నిన్న జొమాటో ఇవాళ స్విగ్గీ.. ప్రతి ఆర్డర్‌కి ప్లాట్‌ఫాం ఫీజు పెంపు

Swiggy: నిన్న జొమాటో ఇవాళ స్విగ్గీ.. ప్రతి ఆర్డర్‌కి ప్లాట్‌ఫాం ఫీజు పెంపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

భోజన డెలివరీ కంపెనీ స్విగ్గీ మూడు వారాల్లో మూడోసారి తన ప్లాట్‌ఫాం ఫీజు పెంచింది. ఇప్పుడు ప్రతి ఆర్డర్‌కి ₹15 వసూలు చేస్తోంది.పండుగల సీజన్‌లో ఆర్డర్‌లు ఎక్కువగా వస్తాయని అంచనాతో,లాభాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీజు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ సభ్యులకూ వర్తిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఫీజును తాత్కాలికంగా ₹14కు పెంచి, తరువాత తిరిగి ₹12కి తగ్గించింది. ఇప్పుడు ఆర్డర్‌ వాల్యూమ్ మళ్లీ పెరుగుతున్నందున, ఫీజు ₹15కు పెంచింది. స్విగ్గీ ఏప్రిల్ 2023లో ఫీజును మొదట ₹2గా ప్రారంభించింది. ఆ తర్వాత కొద్దికొద్దిగా పెంచుతూ, ఎక్కువ ₹10కి చేరింది. ఈ ఫీజు డెలివరీ చార్జ్, GST, రెస్టారెంట్ ఫీజులపై అదనంగా వస్తుంది. నగరాలలో రోజువారీ డిమాండ్‌కి అనుసరించి మారుతుంటుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రతి ఆర్డర్‌కి రూ.15 ప్లాట్‌ఫాం ఫీజు పెంచిన స్విగ్గీ