Page Loader
5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో
ఎయిర్ టెల్, జియో 2022లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి.

5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 10, 2023
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ టెల్, జియో 2022లో తమ 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. మొదట, 5G నెట్‌వర్క్ ఎంపిక చేసిన నగరాలకు మాత్రమే పరిమితం చేసాయి. ప్రస్తుతానికి, భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రెండూ సంస్థలు తమ 5G నెట్‌వర్క్ కవరేజీని విస్తరిస్తున్నాయి. 5G నెట్‌వర్క్‌ని ఉపయోగించడానికి, SIM కార్డ్‌ని అప్‌గ్రేడ్ చేయవలసిన అవసరం లేదు. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో, ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి అందుబాటులో ఉన్న తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి జియో, ఎయిర్ టెల్ తమ వినియోగదారులందరికీ ఉచిత అపరిమిత 5G యాక్సెస్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతానికి, రెండు బ్రాండ్ల నుండి ప్రత్యేకమైన 5G రీఛార్జ్ ప్లాన్‌లు లేవు.

5G నెట్‌వర్క్

అక్టోబర్ లో ఎయిర్ టెల్, జియో 5G అందుబాటులోకి తెచ్చాయి

జనవరి 10 నాటికి, దేశవ్యాప్తంగా 72 నగరాల్లో జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. మొదట అక్టోబర్ 4న ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతాలో అందుబాటులోకి తీసుకువచ్చింది, తర్వాత చెన్నైకి విస్తరించింది. గత ఏడాది నవంబర్‌లో బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో, నవంబర్‌లో పూణేలో, గుజరాత్‌లోని అన్ని జిల్లాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.డిసెంబరులో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి మరికొన్ని నగరాల్లో 5G కవరేజీని విస్తరించింది. ఎయిర్‌టెల్ 5G ప్లస్ నెట్‌వర్క్‌ను అక్టోబర్ 6న ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి నగరాల్లో ప్రారంభించింది. నవంబర్లో గౌహతి, గురుగ్రామ్, పానిపట్, డిసెంబర్‌లో లక్నో, సిమ్లా, ఇంఫాల్, అహ్మదాబాద్, గాంధీనగర్, వైజాగ్, పూణే, జమ్మూ,శ్రీనగర్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది.