NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Airtel: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం .. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు.
    తదుపరి వార్తా కథనం
    Airtel: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం .. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు.
    ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం

    Airtel: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం .. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు.

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 11, 2025
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత టెలికాం దిగ్గజం ఎయిర్‌ టెల్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

    ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌తో కలిసి పని చేయనున్నట్టు వెల్లడించింది.

    "భారతదేశంలోని మా కస్టమర్లకు స్టార్‌లింక్ సేవలను అందించడానికి స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యం కావడం ఓ ముఖ్యమైన మైలురాయి. ఇది నూతన ఉపగ్రహ కనెక్టివిటీకి మా నిబద్ధతను మరింత ప్రదర్శిస్తుంది" అని భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ తెలిపారు.

    ఎయిర్‌టెల్ స్టోర్లలో స్టార్‌లింక్ పరికరాలను విక్రయించే అవకాశముంది. గ్రామీణ పాఠశాలలు,ఆరోగ్య కేంద్రాలు, మారుమూల ప్రాంతాలు,వ్యాపార సంస్థలకు ఇంటర్నెట్ అందించడానికి స్టార్‌లింక్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

    వివరాలు 

    శాటిలైట్ ఇంటర్నెట్ కోసం యూటెల్‌సాట్ వన్‌వెబ్‌తో ఎయిర్‌టెల్ 

    భారత్‌లో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు స్టార్‌లింక్ ఎలా మద్దతు ఇవ్వగలదో, అలాగే ఎయిర్‌టెల్ మౌలిక సదుపాయాలను స్పేస్ ఎక్స్ ఎలా వినియోగించుకోగలదో అనే అంశాలపై రెండు సంస్థలు పరిశీలించనున్నాయి.

    ఇప్పటికే ఎయిర్‌టెల్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం యూటెల్‌సాట్ వన్‌వెబ్‌తో కలిసి పని చేస్తోంది.

    స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి వస్తే,ఇంటర్నెట్ తక్కువగా ఉన్న లేదా లేనిపోని ప్రాంతాల్లో తమ కవరేజీ విస్తరించడానికి దోహదం అవుతుందని ఎయిర్‌టెల్ ఆశిస్తోంది.

    స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్ మాట్లాడుతూ,"ఎయిర్‌టెల్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. స్టార్‌లింక్ భారతదేశ ప్రజలకు తెస్తున్న విప్లవాత్మక మార్పును అన్‌లాక్ చేయడం మాకు ఉత్సాహంగా ఉంది.స్టార్‌లింక్ కనెక్టివిటీ ద్వారా ప్రజలు,వ్యాపారాలు,సంస్థలు చేసే అద్భుతమైన మరియు ప్రేరణాత్మక పనులను చూసి మేము నిరంతరం ఆశ్చర్యపోతుంటాం"అని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ టెల్
    స్పేస్-X

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్

    ఎయిర్ టెల్

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో భారతదేశం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ ఇండియా
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం వ్యాపారం

    స్పేస్-X

    Space-X: స్పేస్-X Polaris Dawn మిషన్ ఆలస్యంగా ప్రారంభమవ్వడానికి  కారణం ఏంటి ? టెక్నాలజీ
    Space-X Polaris Dawn: స్పేస్-X పొలారిస్ డాన్ మిషన్ ఆగస్ట్ 26న ప్రారంభమయ్యే అవకాశం  టెక్నాలజీ
    Space-X: స్టార్‌లింక్ మిషన్ ప్రయోగాన్ని చివరి క్షణంలో రద్దు చేసిన స్పేస్-X  టెక్నాలజీ
    Civilian Polaris Dawn spacewalk: చరిత్ర సృష్టించనున్నసివిలియన్ పొలారిస్ డాన్ స్పేస్‌వాక్ మిషన్  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025