Page Loader
Amazon-MX player: MX ప్లేయర్ యాప్‌ని కొనుగోలు చేసిన అమెజాన్.. మినీటీవీతో విలీనం 
MX ప్లేయర్ యాప్‌ని కొనుగోలు చేసిన అమెజాన్.. మినీటీవీతో విలీనం

Amazon-MX player: MX ప్లేయర్ యాప్‌ని కొనుగోలు చేసిన అమెజాన్.. మినీటీవీతో విలీనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2024
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ (Amazon) తన వీడియో స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసే చర్యల్లో ఉంది. ఈ నేపథ్యంలో, దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఎంఎక్స్ ప్లేయర్‌ను (MX Player) కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. అమెజాన్ తన ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలను మినీటీవీ (Amazon miniTV)తో విలీనం చేసి, ఈ ప్లాట్‌ఫామ్‌ను అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌గా రూపొదించనున్నట్లు పేర్కొంది. కొనుగోలు చేసిన ధర గురించి సమాచారం మాత్రం అందించలేదు. అమెజాన్ ఈ సందర్భంగా, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రీమియం కంటెంట్ అందించనుంది.

వివరాలు 

ఎంఎక్స్ ప్లేయర్ సేవలు ఉచితంగానే..

ఎంఎక్స్ ప్లేయర్ సేవలను యాప్, అమెజాన్.ఇన్ షాపింగ్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ కనెక్ట్‌డ్ టీవీల్లో వీక్షించవచ్చని అమెజాన్ వివరించింది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ విలీనం ఆటోమేటిక్‌గా జరుగుతుందని, ఈ ప్రక్రియలో యాప్‌ను రీ ఇన్‌స్టాల్ చేయడం లేదా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక భవిష్యత్తులో ఎంఎక్స్ ప్లేయర్ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొంది. ఎంఎక్స్ ప్లేయర్‌ను మరింత మందికి చేరువ చేయడానికి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ హెడ్ కరణ్ బేడీ ప్రస్తావించారు. ఇంకా, అమెజాన్‌కు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో (Prime Video) ఉంది.