అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ రికార్డ్: సెకనుకు ఐదు స్మార్ట్ ఫోన్లు అమ్మిన అమెజాన్
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఏడాది జులై 15, 16తేదీల్లో జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో విపరీతంగా అమ్మకాలు జరిపింది. ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేయడంతో కస్టమర్లు ఎగబడ్డారు. ఎలక్ట్రానిక్, ఫ్యాషన్ ఇలా అన్ని రకాల వస్తువుల్లో డిస్కౌంట్ అందించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 14శాతం ఎక్కువ అమ్మకాలు జరిగాయని అమెజాన్ వెల్లడి చేసింది. ప్రైమ్ డే సేల్ రోజున సెకనుకు ఐదు స్మార్ట్ ఫోన్స్ అమ్ముడయ్యాయట. చిన్న గ్రామాలు, టౌన్ల నుండి ఎక్కువగా ఆర్డర్స్ వచ్చాయట. స్మార్ట్ ఫోన్స్ లో సామ్సంగ్ గెలాక్సీ ఎం34 అమ్మకాలు అధికంగా అయ్యాయని అమెజాన్ పేర్కొంది.
చెల్లింపుల కోసం అమెజాన్ పే ఉపయోగించిన వినియోగదారులు
మోటొరోలా రేజర్40 సిరీస్, వన్ ప్లస్ నార్డ్ 3 5జీ, సామ్సంగ్ గెలాస్కీ ఎం34, రియల్ మి నార్జో60 సిరీస్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయట. స్మార్ట్ ఫోన్ కొనుక్కున్న వినియోగదారుల్లో దాదాపు 45శాతం మంది అమెజాన్ పే, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసారట. ప్రతీ నలుగురు వినియోగదారుల్లో ఒకరు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించారట. స్మార్ట్ ఫోన్ ఆర్డర్స్ లో సుమారు 82శాతం గ్రామాలు, టౌన్ల నుండే వచ్చాయట. మొత్తానికి అమెజాన్ ప్రైమ్ డే సేల్ భయకంరంగా సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.