LOADING...
Amazon: 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్ 
2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్

Amazon: 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి అన్ని వ్యాపార రంగాల్లో 35 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు జరిపే లక్ష్యాన్ని కంపెనీ ముందుకు పెట్టింది. ఈ విషయాన్ని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు ఇటీవల వెల్లడించారు. అమెజాన్ సంభవన్ 2025 కార్యక్రమాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తోంది. ఇందులోనే భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్ అధికారిక ప్రకటన చేసింది.

వివరాలు 

2010 నుంచి ఇప్పటివరకు అమెజాన్ భారతదేశంలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

2030 నాటికి కంపెనీ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు జరిపే నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ అధికారి అమిత్ అగర్వాల్ చెప్పారు. ఈ మొత్తం పెట్టుబడులు ఏఐ, ఉద్యోగాల సృష్టి, వ్యాపార విస్తరణ వంటి కీలక రంగాలకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ పెట్టుబడులు కేవలం కంపెనీ విస్తరణకే కాదు, భారతదేశ అభివృద్ధికి ప్రేరణగా ఉపయోగపడతాయని అమిత్ అగర్వాల్ చెప్పారు. కాగా, 2010 నుంచి ఇప్పటివరకు అమెజాన్ భారతదేశంలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

వివరాలు 

2030 నాటికి - మరో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడి

దీని అదనంగా, వచ్చే ఐదు సంవత్సరాల్లో - అంటే 2030 నాటికి - మరో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడిని చేయనుంది. అంతేకాదు, 2030 నాటికి భారతదేశంలో 10 లక్షల ప్రత్య,పరోక్ష ఉద్యోగాలు (1 మిలియన్ jobs) సృష్టించే యోచన కూడా ఉంది. కేవలం ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ విభాగాల్లో మాత్రమే కాకుండా, ఇతర విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలను అందించనుందని అమెజాన్ వెల్లడించింది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, చిన్న,మధ్య తరహా వ్యాపారాలను మద్దతు ఇవ్వడం,ఉపాధి అవకాశాలను పెంపొందించడం అనే ప్రధాన లక్ష్యాల కోసం అని అమెజాన్ పేర్కొంది.

Advertisement