Ambani and Adani : అంబానీ, అదానీ $100 బిలియన్ క్లబ్ నుంచి నిష్క్రమణ.. కారణమిదే
బ్లూమ్‌బర్గ్ 2024 వార్షిక బిలియనర్ లిస్టులో ఆసియా రిచెస్ట్ బిలియనీర్లు, భారతదేశ రిచెస్ట్ బిలియనీర్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. రిలయెన్స్ ఎండీ ముకేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇద్దరూ 2024 సంవత్సరంలో బ్లూమ్‌బర్గ్ $100 బిలియన్ క్లబ్ నుంచి తప్పుకున్నారు. భారతదేశంలోని వారి ఇద్దరి సంపద పెరిగింది. 2024 జనవరి నుంచి టాప్ 20 బిలియనీర్ల సంపద $67.3 బిలియన్ పెరగడం విశేషం. టెక్ మోగుల్ శివ నాదర్ (10.8 బిలియన్ డాలర్లు) సవిత్రి జిందల్ (10.1 బిలియన్ డాలర్లు) అత్యధికంగా లాభపడిన వారిలో ఉన్నాయి. అంబానీకి సంబంధించిన రిపోర్ట్ ప్రకారం, అతని వ్యక్తిగత సంపదకు భారీగా ఎదురుదెబ్బలు తగిలాయి.
అదానీ గ్రూప్ నకు కఠిన సవాళ్లు
జులై 2024లో అంబానీకి ఉన్న సంపద $120.8 బిలియన్ నుంచి, డిసెంబర్ 13 నాటికి అది $96.7 బిలియన్‌కి పడిపోయింది. అదానీ గ్రూప్ సవాళ్లు మరింత తీవ్రమయ్యాయి. జూన్‌లో $122.3 బిలియన్ సంపద కలిగి ఉన్న గౌతమ్ అదానీ, తాజాగా $82.1 బిలియన్‌కి తగ్గింది. అదానీకి సంబంధించిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్, అనుమానిత నేరాలపై కూడా భారీ ప్రభావం చూపింది. బ్లూమ్‌బర్గ్ 2024 ప్రపంచ రిచెస్ట్ కుటుంబాల జాబితాలో వాల్‌మార్ట్ వార్‌టన్లు $432.4 బిలియన్ సంపదతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇది ప్రపంచ రిచెస్ట్ వ్యక్తి అయిన ఎలాన్ మస్క్ సంపదను కూడా మించిపోయింది. భారతదేశం నుంచి అంబానీ, షాపూర్జీ పాలొంజీ మిస్ట్రి కుటుంబం ఈ జాబితాలో 8వ, 23వ స్థానాల్లో ఉన్నారు.