Forbes Richest List: ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలోనూ అంబానీదే అగ్రస్థానం
భారతదేశ సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ (Mukesh Ambani) అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం 100 మంది సంపన్నుల జాబితాలో 92 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ సంపద నాలుగు బిలియన్ డాలర్లు పెరిగి 92 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన తర్వాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautami Adani) 68 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 29.3 బిలియన డాలర్లతో హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, 24 బిలియన్ డాలర్లతో ఓపీ జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు
వంద మంది సంపన్నుల జాబితాలో కొత్తగా ముగ్గరికి చోటు
ఫోర్బ్స్ 100 మంది సంపన్నుల భారతీయుల జాబితాలో కొత్తగా కేవలం ముగ్గురికి మాత్రమే చోటు లభించింది. ల్యాండ్‌మార్క్ గ్రూప్ ఛైర్‌పర్సన్ రేణుకా జగతియానీ, ఏషియన్ పెయింట్స్‌కు చెందిన 'దానీ' కుటుంబం, వస్త్ర ఎగుమతి వ్యాపారంలో ఉన్న కే.పి రామస్వామి వీరిలో ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలోని తొలి 10 మంది సంపన్నులు ముకేశ్ అంబానీ- 92 బి.డాలర్లు గౌతమ్ అదానీ- 68 బి.డాలర్లు శివ్ నాడార్- 39.3 బి.డాలర్లు సావిత్రి జిందాల్- 24 బి.డాలర్లు రాధాకిషన్ దమానీ- 23 బి.డాలర్లు సైరస్ పూనావాలా- 20.7 బి.డాలర్లు హిందుజా కుటుంబం- 20 బి.డాలర్లు దిలీప్ సంఘ్వి- 19 బి.డాలర్లు కుమార మంగళం బిర్లా- 17.5 బి.డాలర్లు షాపూర్ మిస్త్రీ & కుటుంబం- 16.9 బి.డాలర్లు