వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధికా మర్చంట్‌తో గురువారం నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని వర్లీలోని యాంటిలియాలోని అంబానీల ప్రైవేట్ నివాసంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు వ్యాపార, రాజకీయ, సినిమా రంగానికి చెందినవారు అతిధులుగా హాజరయ్యరు. నిశ్చితార్థం వేడుక గుజరాతీ ఆచారాల ప్రకారం చునారి విధి, గోల్ ధన వంటి సంప్రదాయాలతో జరిగింది. రాధిక భారీగా ఎంబ్రాయిడరీ చేసిన క్రీమ్ లెహంగాలో అందంగా కనిపించగా, అనంత్ నీలం రంగు కుర్తా పైజామాలో జాకెట్‌తో కనిపించాడు.
'గోల్ ధన' వేడుకలో అంబానీ కుటుంబం
అనంత్, రాధికల 'రోకా' వేడుక గత నెలలో జరిగింది
రాధికకు మెహందీ వేడుక బుధవారం జరిగింది. ఆమె ఏస్ ఫ్యాషన్ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా రూపొందించిన బహుళ రంగు సిల్క్ లెహంగాను ధరించారు. రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయంలో డిసెంబర్ 29న అనంత్, రాధికల 'రోకా' (వివాహానికి ముందు జరిగే వేడుక) జరిగింది. ఆలయ అర్చకులు దంపతులను ఆశీర్వదించగా, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. శ్రీనాథ్ జీ ఆశీర్వాదం కోసం ఆలయంలో ఒక రోజు గడిపిన తర్వాత, తిరిగొచ్చిన తర్వాత ముంబైలో ఈ వేడుకను నిర్వహించారు.