Page Loader
Startups: 2025లో అంకురాల హవా.. 25 స్టార్టప్స్ ఐపీఓ కోసం సిద్ధం
2025లో అంకురాల హవా.. 25 స్టార్టప్స్ ఐపీఓ కోసం సిద్ధం

Startups: 2025లో అంకురాల హవా.. 25 స్టార్టప్స్ ఐపీఓ కోసం సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

అంకుర సంస్థలు (స్టార్టప్స్) వడ్డీ వ్యయాలు అధికంగా ఉండటంతో పాటు ఆర్థిక సంస్థలు కావాల్సినంత నిధులు అందించడంలో ఆసక్తి చూపడం లేదు. తమ అభివృద్ధి దశలో పెట్టుబడులకు వెంచర్ క్యాపిటలిస్టులను ఆశ్రయించాయి. కంపెనీ అభివృద్ధి చెందాక ఈ వెంచర్ క్యాపిటలిస్టులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. పెట్టుబడులు తిరిగి ఇచ్చేందుకు కంపెనీ అవసరాల కోసం మరిన్ని నిధులను సమకూర్చుకునేందుకు మార్కెట్లో నిలదొక్కుకుంటున్న అంకుర సంస్థలు స్టాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నాయి. 2023లో 13 అంకుర సంస్థలు తొలి పబ్లిక్ ఆఫర్‌కు రాగా, మదుపరుల నుంచి మంచి స్పందన వచ్చింది. 2024లో దాదాపు 25 అంకుర సంస్థలు ఐపీఓకు రావాలని ప్లాన్ చేస్తున్నాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.

Details

 కొత్త తరపు కంపెనీలు 

2024లో IPOలకు రావాలని భావిస్తున్న అంకుర సంస్థల్లో ఏథర్‌ ఎనర్జీ, ఆరిస్‌ ఇన్‌ఫ్రా, అవాన్సె, అయె ఫైనాన్స్, బోట్, బ్లూస్టోన్, కార్‌దేఖో, క్యాప్టైన్‌ ఫ్రెష్, డెవ్‌ఎక్స్, ఇకామ్‌ ఎక్స్‌ప్రెస్, ఫ్రాక్టల్‌ లాంటి కంపెనీలున్నాయి. వాటితో పాటు జెప్టో, ఎడ్యుటెక్‌ ఫిజిక్స్‌వాలా కూడా IPO కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టుల పాత్ర అంకుర సంస్థల అభివృద్ధిలో వెంచర్ క్యాపిటలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలు అభివృద్ధి చెందాక సంస్థ విలువ పెరుగుతుంది. ఈ సమయంలో వెంచర్ క్యాపిటలిస్టులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. ఈ ఏడాది 15కు పైగా వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు IPOకి రాబోతున్నాయి.

Details

2023లో 29,000 కోట్ల నిధుల సమీకరణ

2023లో వచ్చిన 13 అంకుర సంస్థలు కలిపి రూ. 29,000 కోట్ల నిధులను సమీకరించాయి. ముఖ్యంగా స్విగ్గీ, ఓలా ఎలక్ట్రిక్, ఫస్ట్‌క్రైలాంటివి లాంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. 2022లో 2, 2023లో 5 అంకుర సంస్థలు మాత్రమే IPOకి వచ్చినా 2024 ఈ రంగానికి చాలా సానుకూలంగా నిలుస్తోంది. ఇటీవల మార్కెట్లో కొత్తగా లిస్టయ్యిన అంకుర సంస్థల్లో పదికి పైగా కంపెనీల షేర్లు ఇష్యూ ధరకు మించి ఉన్నాయి. భారీ సమీకరణల కోసం ప్రణాళికలు జెట్‌వర్క్, పైన్‌ల్యాబ్స్ వంటి కంపెనీలు రూ. 8,000 కోట్లకు పైగా నిధులను సమీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. జెప్టో, ఇన్‌ఫ్రా.మార్కెట్, ఫ్రాక్టల్‌ లాంటి సంస్థలు కూడా మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో నిధులను సమీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

Details

 ఫిన్‌టెక్‌ రంగానికి ప్రాధాన్యం

IPO కోసం ముందుకొస్తున్న సంస్థల్లో ఎక్కువగా ఫిన్‌టెక్‌ రంగం ఆధిపత్యం చాటుతోంది. ముఖ్యంగా అవాన్సె ఫైనాన్షియల్‌ సర్వీసెస్, అయె ఫైనాన్స్, పేయూ, ఇన్‌క్రెడ్‌ లాంటి కంపెనీలు IPOకు రావాలని భావిస్తున్నాయి. పెట్టుబడుల పెరుగుదల కొన్ని అంకుర సంస్థలకు ఇటీవల వరుస పెట్టుబడులు సమకూరాయి. వృద్ధి దశలో ఉన్న సంస్థలకే కాకుండా ప్రారంభ దశలో ఉన్నవాటికి కూడా వెంచర్ క్యాపిటలిస్టులు నిధులు అందిస్తున్నారు. 2024లో 1,337 లావాదేవీల ద్వారా సుమారు రూ. 1.19 లక్షల కోట్ల నిధులను అంకుర సంస్థలు సమీకరించాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ మొత్తం ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉంది.