తదుపరి వార్తా కథనం
GST collections: జీఎస్టీ వసూళ్లలో మరోసారి రికార్డు.. ఫిబ్రవరిలో రూ.1.84 లక్షల కోట్లు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 01, 2025
05:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. ఫిబ్రవరి నెలలో రూ.1.84 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇది గతేడాది ఇదే నెలతో పోలిస్తే 9.1 శాతం వృద్ధిని సాధించింది.
దేశీయ రెవెన్యూ వసూళ్లు 10.2 శాతం పెరిగి రూ.1.42 లక్షల కోట్లకు చేరగా, దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 5.4 శాతం వృద్ధితో రూ.41,702 కోట్లుగా నమోదైంది.
Details
సెస్సుల రూపంలో రూ.13,868 కోట్లు వసూలు
ఫిబ్రవరి నెలలో సెంట్రల్ జీఎస్టీ ద్వారా రూ.35,204 కోట్లు, స్టేట్ జీఎస్టీ ద్వారా రూ.43,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా రూ.90,870 కోట్లు వసూలయ్యాయి.
సెస్సుల రూపంలో రూ.13,868 కోట్లు సమకూరినట్లు ప్రభుత్వం పేర్కొంది.
గడిచిన జనవరి నెలలో అత్యధికంగా రూ.1.96 లక్షల కోట్లు వసూలైన విషయం తెలిసిందే.