
iPhone 17: ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభం.. స్టోర్ల ముందు భారీ క్యూ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం నుంచే ఆ సరికొత్త మోడళ్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి.ఈక్రమంలో ఆపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు క్యూ కట్టారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న ఆపిల్ స్టోర్ వద్ద కొనుగోలుదారులు అర్థరాత్రి నుంచే క్యూలో నిలబడ్డారు. అదే విధంగా ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ ముందు కూడా పెద్ద ఎత్తున జనం చేరి కొత్త ఫోన్లను అందుకునేందుకు ఆసక్తి చూపించారు.
వివరాలు
బేస్ మోడల్‌ను 256 జీబీ వేరియంట్‌తో..
ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను మొదటిగా కొనుగోలు చేసిన అమాన్ మెమన్ అనే వినియోగదారు మీడియాతో మాట్లాడుతూనే తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి గత ఆరు నెలలుగా ఎదురు చూశానని ఆయన వెల్లడించాడు. ఆపిల్ తాజాగా ఐఫోన్ 17,ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో,ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనే నాలుగు మోడళ్లను వినియోగదారుల కోసం విడుదల చేసింది. ముఖ్యంగా ఈసారి బేస్ మోడల్‌ను 256 జీబీ వేరియంట్‌తోనే తీసుకొచ్చింది. ధరల విషయానికి వస్తే,ఐఫోన్ 17 ధరను కంపెనీ రూ.82,900గా నిర్ణయించగా,ఐఫోన్ 17 ఎయిర్ ధర రూ.1,19,900గా ప్రకటించింది. ఐఫోన్ 17 ప్రో మోడల్ ధర రూ.1,34,900గా ఉంటే, ప్రో మాక్స్ ధరను రూ.1,49,900గా యాపిల్ ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్టోర్ల ముందు భారీ క్యూ కట్టిన కొనుగోలుదారులు
कौन कहता है हमारे देश में महंगाई और बेरोज़गारी है, देखो iPhone 17 लेने के लिए लोग लाइन में लगे हैं, जो करीब 83 हज़ार का है।
— Virat Sharma 🇮🇳 (@Virat_indian875) September 19, 2025
pic.twitter.com/vz7pBRnMkP