Page Loader
బైజూస్‌ సంక్షోభంపై కన్నీరుమున్నీరైన సీఈఓ రవీంద్రన్‌
బైజూస్‌పై సంక్షోభంపై కన్నీరుమున్నీరైన సీఈఓ రవీంద్రన్‌

బైజూస్‌ సంక్షోభంపై కన్నీరుమున్నీరైన సీఈఓ రవీంద్రన్‌

వ్రాసిన వారు Stalin
Jul 26, 2023
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్-టెక్ స్టార్టప్ 'బైజూస్' ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. గవర్నెన్స్‌లో లోపాలు, విదేశీ మారకపు ఉల్లంఘనలతో పాటు ఈడీ దాడులు లాంటి పరిణామాలు ఆ సంస్థపై విశ్వసనీయతను కోల్పోయేలా చేసింది. ఇన్ని సమస్యల నేపథ్యంలో ఒక సమయంలో ఆ సంస్థ సీఈఓ రవీంద్రన్‌ తీవ్రంగా విలపించినట్లు జాతీయ మీడియా సంస్థలు వార్తలు రాసుకొచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో విదేశీ మారకపు ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో బెంగళూరులోని బైజూస్ కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. ఇది కంపెనీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది.

బైజూస్

1 బిలియన్ డాలర్ల ఈక్విటీ ఫండ్‌ను సేకరించే పనిలో బైజూస్

కంపెనీ కార్యాలయాలపై ఈడీ దాడులు జరుగుతున్న సమయంలో సీఈఓ రవీంద్రన్ దుబాయ్‌లో నుంచి పెట్టుబడిదారులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఈడీ దాడులపై వివరణ ఇచ్చారు. పెట్టుబడిదారులతో జరిగిన సంభాషణలో రవీంద్రన్‌కు తీవ్రంగా విలపించినట్లు ఆ మీటింగ్ పాల్గొన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్రమంలోనే తాను నిర్దోషినని ప్రకటించుకుంటూ రవీంద్రన్‌ కన్నీరుమున్నీరుగా విలపించారట. ఇదిలా ఉంటే, సంక్షోభాన్ని అధిగమించేందుకు బైజూస్ సంస్థ 1 బిలియన్ డాలర్ల ఈక్విటీ ఫండ్‌ను సేకరించే పనిలో నిమగ్నమైంది. 2023 ప్రథమార్ధం నాటికి బైజూస్‌లో పెట్టబడులు నాలుగేళ్ల కనిష్టానికి చేరాయి.