
Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన రికార్డ్..8 కోట్లు దాటిన సభ్యుల సంఖ్య.. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ పథకం "అటల్ పెన్షన్ యోజన" (APY) బాగా క్లిక్ అయింది. ఈ స్కీమ్‌లో చేరిన చందాదార్ల సంఖ్య ఇప్పుడు 8 కోట్ల మైలురాయిని దాటింది. ఈ పెన్షన్ పథకం ప్రస్తుతం 10వ సంవత్సరంలో ఉంది. 2015 మే నెలలో, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, అసంఘటిత కార్మికుల కోసం ఈ పింఛను పథకాన్ని ప్రారంభించింది. దేశంలోని ప్రతి సీనియర్ సిటిజన్‌కు ప్రతి నెలా ఒక ఫిక్స్‌డ్ అమౌంట్ అందాలన్నది అటల్ పెన్షన్ యోజన ఉద్దేశం.
వివరాలు
అటల్ పెన్షన్ యోజన పథకం ప్రయోజనాలు
అటల్ పెన్షన్ యోజన పథకం చందాదార్లు 'సంపూర్ణ సురక్ష కవచ్' (Sampurna Suraksha Kavach) కిందకు వస్తారు. అంటే, చందాదారు జీవించి ఉన్నంతకాలం హామీతో కూడిన పెన్షన్ డబ్బును అందించడమే కాకుండా, అతను/ ఆమె మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి కూడా పెన్షన్ అందించేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు. ఇది మాత్రమే కాదు, అటల్ పెన్షన్ యోజన చందాదారు, జీవిత భాగస్వామి మరణించిన తర్వాత, 60 సంవత్సరాల వయస్సు వరకు కూడబెట్టిన మొత్తం డబ్బు ఆ కుటుంబానికి తిరిగి వస్తుంది.
వివరాలు
అర్హతలు.. ఎంత పింఛను వస్తుంది?
18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఈ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారు ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ కూడా ఉండాలి. ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తులు అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అనర్హులు. సబ్‌స్క్రైబర్‌కు 40సంవత్సరాలు వచ్చే వరకు అటల్ పెన్షన్ యోజనలో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. సబ్‌స్క్రైబర్‌కు 60సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుంచి,నెలనెలా కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.5,000 వరకు పింఛను వస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 వరకు పెన్షన్ పొందవచ్చు. చందాదారు మరణిస్తే, జీవిత భాగస్వామికి జీవితాంతం పెన్షన్ అందుతుంది. ఇద్దరూ చనిపోతే పింఛను మొత్తం నామినీకి ఇస్తారు.
వివరాలు
అటల్ పెన్షన్ యోజన అకౌంట్ ఎలా తెరవాలి..?
అన్ని నేషనల్ బ్యాంకులు ఈ స్కీమ్‌ను అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల వెబ్‌సైట్‌కి వెళ్లి, అటల్ పెన్షన్ అకౌంట్‌ను తెరవవచ్చు. ఆన్‌లైన్‌గా లేదా బ్యాంకుల వద్ద అటల్ పెన్షన్ దరఖాస్తు ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన సమాచారమంతా నింపాలి. అప్లికేషన్ ఫామ్‌ను నింపిన తర్వాత.. బ్యాంకు వద్ద ఈ ఫామ్‌ను సమర్పించాలి వాలిడ్ మొబైల్ నెంబర్ అందివ్వాలి. అలాగే మీ ఆధార్ కార్డు ఫోటోకాఫీని కూడా ఇవ్వాలి. అప్లికేషన్ అప్రూవల్ అయిన తర్వాత మీకు కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.