LOADING...
Filpkart: ఒక రూపాయికే ఆటో రైడ్‌.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో ఎగబడుతున్న జనం
ఒక రూపాయికే ఆటో రైడ్‌.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో ఎగబడుతున్న జనం

Filpkart: ఒక రూపాయికే ఆటో రైడ్‌.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో ఎగబడుతున్న జనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ 2024ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 27న ప్రారంభమైన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు అందిస్తోంది. దీంతో భారీ ఎత్తున్న సేల్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బెంగళూరు వాసులకు ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1 కే ఆటో రైడ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా స్థానిక ఆటో డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల ప్రజలు ఒక రూపాయికి ఆటో బుక్ చేసుకోవడం చాలా సులభమైంది.

Details

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు అదరిపోయే స్పందన

బెంగళూరు నగరంలో ప్రత్యేక ప్రాంతాలలో ఫ్లిప్‌కార్ట్ తమ స్టాళ్లు ఏర్పాటు చేసి, పీక్ అవర్స్‌లో ప్రయాణం సౌలభ్యాన్ని పెంపొందించడానికి, క్యాష్‌లెస్ సేవలను ప్రోత్సహించడంపై ఫోకస్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు అద్భుత స్పందన లభించినట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది. ఇక సోషల్ మీడియాలో ఈ ఆఫర్‌పై పలు ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. ఈ ఆటో రైడ్ స్కీమ్‌ను ఇతర నగరాల్లో కూడా అందుబాటులో ఉంచాలని పలువురు నెటిజన్లు అభ్యర్థిస్తున్నారు.