
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఈ తప్పులు చేయకండి
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు పొరపాట్లు చేయడం సర్వసాధారణం. అయితే తరుచుగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అయితే, అవగాహన ద్వారా వాటిని చాలా వరకు నివారించి ఆర్థిక లక్ష్యాలను సాధించచ్చు.
పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడం అనేది పెట్టుబడిదారుగా ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన విషయం. నష్టాన్ని తగ్గించుకోవడానికి వివిధ రకాల స్టాక్‌లు, సెక్టార్‌లు, అసెట్ క్లాస్‌లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)లో పెట్టుబడి పెట్టడం అనేది పోర్ట్‌ఫోలియోని బలపరుస్తుంది.
ఒక పరిశ్రమలో వివిధ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం అనేది మరొక మార్గం. వ్యక్తిగత స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడానికి చాలా పరిశోధన, శ్రద్ధ అవసరం. పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆర్థికాంశాలు దృష్టిలో పెట్టుకోవాలి.
పెట్టుబడి
సొంతంగా పరిశోధన చేసి పెట్టుబడి వ్యూహాన్ని అమలుచేయడం ముఖ్యం
దీర్ఘకాలిక పెట్టుబడి కంటే స్వల్పకాలిక మార్కెట్ కదలికల ఆధారంగా కొనుగోలు చేయడం లేదా అమ్మడం వంటివి చెయ్యచ్చు. క్రమశిక్షణతో ఉండటం, భయంతోనో, దురాశతోనో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ముఖ్యం.
చాలా సార్లు, పెట్టుబడికి సంబంధించిన సమాచారం బాగా పనిచేసిన తర్వాత మాత్రమే ప్రజల వరకు వెళ్తుంది. మీడియా జోక్యం చేసుకునే సమయానికి, స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో, అందరినీ అనుసరించడం కంటే సొంతంగా పరిశోధన చేసి పెట్టుబడి వ్యూహాన్ని అమలుచేయడం ముఖ్యం.
పెట్టుబడి పెట్టే డబ్బు అద్దె లేదా బిల్లులు చెల్లించడం వంటి ఆర్ధిక అవసరాల కోసం అయితే, వాటి కోసం బలవంతంగా అమ్మాల్సి రావచ్చు. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళనకు దారి తీస్తుంది.