ఫలితాలు ప్రకటించిన బజాజ్ ఫిన్‌సర్వ్.. 24 శాతం పెరుగుదలతో రూ.1,929 కోట్లకు చేరుకున్న నికర లాభాలు
బజాజ్ ఫిన్‌సర్వ్,తన Q2 ఫలితాలను ప్రకటించింది.ఈ మేరకు తన ఏకీకృత నికర లాభంలో 24 శాతం పెరిగినట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలోనే రూ.1,929 కోట్లుగా బజాజ్ నివేదించింది. FY24 రెండో త్రైమాసికంలో బజాజ్ ఫిన్‌సర్వ్ తన ఆర్థిక సంవత్సరంలో భాగంగా Q2 ఫలితాలను వెల్లడించింది.ఇందులో భాగంగా ఎన్‌బీఎఫ్‌సీ రూ.1,929 కోట్ల మేర ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది రూ. 1,557 కోట్ల మేర లాభాలను కంపెనీ ప్రకటించింది.గతంతో పోలిస్తే ఈసారి 24 శాతం వృద్ధి పెరగడం గమవార్హం. బజాజ్ ఫిన్‌సర్వ్, తన కార్యకలాపాల ద్వారా రూ.26, 023 కోట్ల టర్నోవర్ సాధించింది.అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో రూ.20,803 కోట్ల మేర వ్యాపారం జరిగింది.దీంతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైంది.
ఏకీకృత నికర లాభంలో 28 శాతం ఆకట్టుకునే వృద్ధి
ఫిన్‌సర్వ్ రెండో త్రైమాసికంలో దాని అనుబంధ సంస్థల ద్వారా బలమైన ఆపరేటింగ్ పనితీరును కనబర్చింది. బజాజ్ ఫిన్‌సర్వ్, 52.4 శాతం వాటాను కలిగి ఉన్న బజాజ్ ఫైనాన్స్, దాని ఏకీకృత నికర లాభంలో రూ. 3,551 కోట్లతో 28 శాతం ఆకట్టుకునే వృద్ధిని సాధించింది. ఈ అత్యుత్తమ పనితీరు నిర్వహణలో ఆస్తుల నిర్వహణ (AUM-Company Assets Under Management), పెరిగిన నికర వడ్డీ ఆదాయం, మెరుగైన ఆస్తుల పనితీరు కారణంగా బలమైన వృద్ధిని సాధించగలిగింది. సెప్టెంబర్ 30, 2023 నాటికి, బజాజ్ ఫైనాన్స్ కోసం AUM రూ. 2.9 లక్షల కోట్లకు చేరుకుంది.మరోవైపు శుక్రవారం, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు NSEలో 1.56% అధిక విలువతో రూ. 1,584.30 వద్ద ట్రేడయ్యాయి.