Bank Holidays: 2024 జనవరిలో బ్యాంకుల సెలవులు ఇవే
2024లో జనవరికి సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా బ్యాంకులకు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు మినహా మొత్తం 11 సెలవులను ప్రకటించినట్లు ఆర్ బీఐ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో స్థానిక పండగలతో పాటు గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ వేడుకల సందర్భంగా కూడా వచ్చే నెల బ్యాంకులు పని చేయవు. ఆర్‌బీఐ పేర్కొన్న తేదీల్లో బ్యాంకులకు భౌతికంగా సెలవులు అయినప్పటికీ.. మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో సహా డిజిటల్ సేవలు యథావిధిగా నడుస్తాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆన్ లైన్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉందని వివరించింది.
ఈ తేదీల్లో బ్యాంకులు పని చేయవు..
జనవరి 1, 2024 (సోమవారం): న్యూ ఇయర్ జనవరి 11, 2024 (గురువారం): మిషనరీ డే (మిజోరం) జనవరి 12, 2024 (శుక్రవారం): స్వామి వివేకానంద జయంతి (పశ్చిమ బెంగాల్) జనవరి 13, 2024 (శనివారం): లోహ్రి (పంజాబ్) జనవరి 14, 2024 (ఆదివారం): మకర సంక్రాంతి (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్) జనవరి 15, 2024 (సోమవారం): పొంగల్ జనవరి 15, 2024 (సోమవారం): తిరువల్లువర్ దినోత్సవం (తమిళనాడు) జనవరి 16, 2024 (మంగళవారం): తుసు పూజ (పశ్చిమ బెంగాల్, అసోం) జనవరి 17, 2024(బుధవారం): గురు గోవింద్ సింగ్ జయంతి జనవరి 23, 2024(మంగళవారం): సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 26, 2024(శుక్రవారం): గణతంత్ర దినోత్సవం జనవరి 31, 2024(బుధవారం): మీ-డ్యామ్-మీ-ఫై (అసోం)